బిజినెస్

రూ.800 కోట్ల విలువైన 500 ఆస్తుల వేలానికి ఐఓబీ నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 16: తమ బ్యాంకు తిరిగి స్వాధీనం చేసుకున్న రూ. 800 కోట్ల విలువైన మొత్తం ఐదువందల ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు (ఐఓబీ) బుధవారం నాడిక్కడ వెల్లడించింది. ఈమేరకు ‘ఈ-వేలం పాట’ నిర్వహించేందుకు ప్రాపర్టీ సైట్ ‘మేజిక్‌బ్రిక్స్.కామ్’తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. చెన్నై ప్రధాన కార్యాలయంగా నడుస్తున్న ఐఓబీ స్థిరాస్తి రంగానికి రుణ కేటాయింపులు చేసే కీలక బ్యాంకుగా ఉంది. ఇలావుండగా ఈ బ్యాంకు తిరిగి స్వాధీనం చేసుకున్న ఆస్తులు చెన్నై, కోయంబత్తూర్, ముంబయి, పూనే, నాగ్‌పూర్, కోల్‌కతా, రాంచీ, మీరట్, లక్నో, లూధియానా, భోపాల్ సహా హైదరాబాద్‌లోనూ ఉన్నాయి. ‘ప్రస్తుతం స్థిరాస్తి రంగానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం కీలక వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆస్తుల కొనుగోలు ప్రక్రియ డిజిటల్ విధానం ద్వారా సానుకూలంగా నడుస్తోంద’ని ఐఓబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే. స్వామినాథన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ-వేలానికి ప్రాధాన్యత పెరిగిందని, ఇందులో ‘మేజిక్‌బ్రిక్స్’తో భాగస్వాములవడం ద్వారా మెగా లక్ష్య సాధనలో విజయం సాధించిన అనుభూతిని కలుగుతోందని ఆయన తెలిపారు. ఈనెల 21నుంచి 30 వరకు ఈ వేలం ప్రక్రియ దశలవారీగా సాగుతుందని ఈ సందర్భంగా మేజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్‌పాయ్ తెలిపారు. తమ పోర్టల్ ఈ-వేలం ప్రక్రియలో గత రెండేళ్లుగా విజయపథంలో సాగుతోందన్నారు. బ్యాంకు తిరిగి స్వాధీనం చేసుకున్న 1,300 ఆస్తులను ఇప్పటి వరకు తమ పోర్టల్ వేదికగా ఈ-వేలం ద్వారా విక్రయించినట్టు తెలిపారు.