బిజినెస్

మరో ఐదేళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భాగస్వామ్యాన్ని ‘వొడాఫోన్ ఐడియా లిమిటెడ్’ (వీఐఎల్) సంస్థ మరో ఐదేళ్లపాటు కొనసాగించనుంది. ఈమేరకు ఒప్పదం కుదిరిందని దేశంలో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ గురువారం నాడిక్కడ తెలిపింది. దాదాపు దశాబ్ధకాలంగా సాగుతున్న ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించడం ఆనందంగా ఉందని టీసీఎస్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వినియోగదారులకు మరిన్ని మంచి సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వీఐఎల్ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోందని వివరించింది. ఆలావుండగా ఈ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయం టీసీఎస్ వెల్లడించలేదు. వొడాఫోన్ ఐడియా వాణిజ్య విస్తరణకు, ఆపరేటింగ్ సమర్థత అభివృద్ధికి, తద్వారా ఆర్థికాభివృద్ధికి అవసరమైన మరింత సమున్నత వైజ్ఞానిక సహకారాన్ని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని టీసీఎస్ తెలిపింది. కాగా ఈ భాగస్వామ్యం ద్వారా ఆటోమేషన్, డిజిటలైజేషన్ విధానంతో విలువ విస్తరణ, సుస్థిర వాణిజ్యం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించ్నిట్టు వీఐఎల్ సీఐఓ హితేష్ టీకే ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే 4.0 వాణిజ్య ఫ్రేమ్‌వర్క్ ద్వారా మరింతగా డిజిటల్ సాంకేతికత తాలూకు అనుభవాన్ని వినియోగదారులకు చేరువ చేస్తామని టీసీఎస్ ఇండియా అధిపతి ఉజ్వల్ మాధుర్ తెలిపారు.