బిజినెస్

‘ప్రపంచ ఆర్థిక ఫోరం’ శిఖరాగ్ర సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/జెనీవా, అక్టోబర్ 17: వచ్చే జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు దావోస్‌లోని స్విస్ అల్పైన్ పట్టణంలో జరుగనున్న 50వ ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యుఈఎఫ్) వార్షిక సమావేశం దేశాల మధ్య బలమైన, సుస్థిర బంధం నెలకొనేందుకు దోహదం చేస్తుదన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. సుమారు మూడు వేల మందికి పైగా అంతర్జాతీయ స్థాయి నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వివిధ దేశాల ప్రధాన మంత్రులు, దేశాధ్యక్షులు, అత్యున్నత స్థాయి సీఈవోలకు ఈ సమావేశం వేదిక కానుంది. ప్రభుత్వాలు, ప్రజలకు మధ్య సమన్వయాన్ని మరింతగా పాదుకొల్పే వేదికగానూ గణుతికెక్కిన ఈ సమావేశానికి భారత దేశానికి చెందిన నేతలు, ప్రత్యేకించి మంత్రులు, పారిశ్రామికవేత్తలు, పౌరసేవల విభాగాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని నిర్వాహకులు అంచనావేస్తున్నారు. హాజరయ్యే వారు ఎవరనే విషయం వచ్చే నెలలో స్పష్టమవుతుంది. ఈక్రమంలో ‘దేశాల మధ్య సంబంధ బాంధవ్యాల బలోపేతానికి ఇది మరో మైలురాయిగా నిలువనుందని, ప్రపంచ దేశాల మధ్య బలమైన, సుస్థిర బంధాన్ని ఏర్పరిచేందుకు ఈ శిఖరాగ్ర సమావేశం దోహదం చేస్తుంద’ని డబ్ల్యుఈఎఫ్ గురువారం నాడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశాల్లోనే ఒక ‘యూనివర్సల్ ఈఎస్‌జీ స్కోర్ కార్డ్’ను డబ్ల్యుఈఎఫ్ అంతర్జాతీయ వాణిజ్య మండలి నేతృత్వంలో విడుదల చేయడం జరుగుతుందని వివరించింది. దీనికి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికా సీఈవో బ్రియాన్ మోయినీహాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ స్కోర్ కార్డ్ ద్వారా కంపెనీల ప్రాధాన్యతల జాబితాను నమోదు చేయడం జరుగుతుందని, ప్రధానంగా పర్యావరణం, సాంఘిక, పరిపాలనా పరమైన అంశాలను ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని డబ్ల్యుఈఎఫ్ తెలిపింది. ఈసమావేశాల్లో మరోమారు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనా ల్డ్ ట్రంప్ కలుసుకునే గొప్ప అవకాశం ఉందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖులు అధికంగా భారత్ నుంచి హాజరవుతారని వివరించారు. కనీ సం 100 మంది భారత సీఈవోలు ప్రతిఏటా ఈ సమావేశానికి హాజరవుతుంటారని తెలిపారు. ప్రధానంగా ఈ శిఖరాగ్ర సమావేశంలో సాంకేతికాభివృ ద్ధి, వాణిజ్య విస్తరణపై చర్చలు జరుగుతాయని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, కార్యనిర్వాహక చైర్మన్ క్లాస్ స్క్వాబ్ ఈ సందర్భంగా స్పష్టం చేశా రు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అధిక సంపన్నుల తీరుపై అసంతృప్తి ఉందని, వీరే తమ అభివృద్ధికి నిరోధకులుగా ఉన్నారన్న భావన ఉంద ని చెప్పారు. అలాగే గ్లోబల్ వార్మింగ్‌ను సైతం 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చూడాల్సిన ఆవశ్యకతపై సదస్సులో చర్చ జరుగుతుందన్నారు.