బిజినెస్

రైల్వేలో కార్మికుల కుదింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 17: రైల్వేలో రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చును తగ్గించుకునే క్రమంలో కార్మికులను కుదించాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రైవేటీకరణలో భాగంగా కార్మికుల కుదింపునకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒకేసారి కాకుండా ప్రతి ఏడాది దశలవారీగా కుదింపు చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనివల్ల ప్రైవేటీకరణకు ముందుగా కార్మికుల సంఖ్యలో స్పష్టత వస్తుందని రైల్వే భావిస్తోంది. ఈ లోపు జీతభత్యాలు తదితర ప్రయోజనాల కింద పెట్టే ఖర్చుల భారాన్ని చాలామటుకు తగ్గించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. పనితనాన్ని కొలమానంగా తీసుకుని విధుల్లో నిర్లక్ష్యం, సామర్థ్యం చూపని కార్మికులకు ఉద్వాసన పలకాలని రైల్వే నిర్ణయించినట్టుగా తెలిసింది. అదీ పదవీ విరమణకు కనీసం మూడేళ్ళ ముందుగాను, 30 ఏళ్ళు పనిచేసి ఉండే కార్మికుల సేవలను పరిగణనలోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల కార్మిక సంఘాల నుంచి ఎటువంటి విమర్శలు, వత్తిళ్ళు ఉండవని భావిస్తున్న రైల్వే ఈ క్రమంలో చర్యలకు పూనుకుంటోంది. క్లర్కులు, అసిస్టెంట్లు, టెక్నికల్ స్ట్ఫా తదితర నాలుగైదు క్యాటగిరీలకు సంబంధించి తొలి దశలో పనిచేయని రైల్వే కార్మికుల ఉద్వాసనకు శ్రీకారం చుట్టనుంది. తదుపరి మిలిగిన క్యాటగిరీల్లో ఒక్కో దానిని పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తోంది. 17 రైల్వేజోన్లతో పాటు విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ పరిధిలోను ఈ విధానాన్ని వర్తింపు చేయాలని రైల్వే పంపిన ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఆయా డివిజన్ల పరిధిలో కార్మికుల కుదింపు అనేది ఏ విధంగా ఉండాలి? అసలు ఏఏ క్యాటగిరీల సిబ్బందికి తొలి దశలో ఉద్వాసన పలకాలి? వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు 20 నుంచి 30 శాతం మందిని ఇళ్ళకు పంపితే ఎదురయ్యే పరిస్థితులేమిటి? అనే పలు అంశాలను ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలిసింది. సిగ్నలింగ్ అండ్ టెలీ కమ్యూనికేషన్, మెకానికల్, సేఫ్టీ, కమర్షియల్, మెడికల్, కనస్ట్రక్షన్, పరిపాలన, రన్నింగ్ విభాగాల్లో దాదాపు 15 లక్షల మంది వివిధ క్యాటగిరీల కింద పనిచేస్తున్నారు. అయితే ఇందులో కుదింపు ప్రక్రియను నాలుగైదు క్యాటగిరీలకు వర్తింపు చేయాలని రైల్వే నిర్ణయించింది. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఉన్న 18 రైల్వే జోన్లకు సంబంధించి కనీసం రెండు నుంచి మూడు లక్షల మందిని, అదే జోన్ల వారీగా తీసుకుంటే కనీసం 12 నుంచి 15 వేల మందిని కుదించుకుంటూ రావాలనేది రైల్వే ఆలోచన. ఇప్పటికే రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్యం, భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు, టికెట్ల విక్రయాలు, వౌలిక వసతులు తదితర అనేకం ప్రైవేటీకరించగా త్వరలో రైళ్ళను దశలవారీగా ప్రైవేటు విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యుత్ సరఫరా వ్యవస్థాపన, నిర్వహణ, ట్రాక్షన్ పవర్ కంట్రోల్, ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ (ఓహెచ్‌ఇ) వంటి వాటిని త్వరలో ప్రైవేటీకరించే యోచనలో ఉన్నట్టు తెలిసింది.