బిజినెస్

కొనసాగిన లాభాల పరంపర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 17: వరుసగా ఐదోరోజూ లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తాజాగా గురువారం అత్యధిక లాభాలను నమోదు చేశాయి. ప్రధానంగాబ్రిటన్-ఐరోపా దేశాల మధ్య చర్చలు బ్రెగ్జిట్ డీల్ కుదిరే దశకు చేరడం అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో మదుపర్లకు సానుకూల అంశంగా మారింది. అంతేకాకుండా మరిన్ని అర్థిక ఉద్దీపన చర్యలు చేపడతామని, విదేశీ పెట్టుబడిదారులు విరివిగా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దేశీయంగా మార్కెట్లకు ప్రోత్సాహకరంగా మారిందని వాణిజ్య విశే్లషకులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ మధ్యాహ్నం తర్వాత పరుగులు పెట్టింది. 453.07 ఎగబాకి 1.17 శాతం లాభాలతో 39వేల మార్కును దాటి 39,052.06 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌సీ సూచీ నిఫ్టీ సైతం 12.35 పాయింట్లు (1.07 శాతం) లాభపడింది. 11,586.35 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్ బ్యాంక్ భారీగా 15.19 శాతం లాభపడి గురువారం నాటి ట్రేడింగ్‌లో అగ్రభాగాన నిలిచింది. అలాగే టాటామోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, మారుతి సైతం అత్యధికంగా 9.82 శాతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్, వేదాంత, పవర్‌గ్రిడ్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.04 శాతం నష్టపోయాయి. ఇలావుండగా సుదీర్ఘ చర్చల అనంతరం చివరికి బ్రెగ్జిట్ డీల్ అవుట్‌లైన్ వద్దకు చేరుకున్నామని అటు బ్రిటన్, ఇటు ఐరోపా యూనియన్ దేశాల ప్రతినిధులు గురువారం ప్రకటించాయి. ఐతే బీఎల్‌ఓసీ ఈ డీల్‌ను లాంఛనంగా ఆమోదించాల్సివుంది. అంతేకాకుండా రెండు వైపులా పార్లమెంటుల్లో ఖరారు చేయాల్సి ఉంది. ఇవన్నీ లాంఛనాలే కాబట్టి బ్రెగ్జిట్ డీల్ దాదాపుగా కుదిరినట్టేనన్న విశ్వాసం అంతర్జాతీయంగా వాణిజ్య వర్గాలకు నెలకొంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూల వ్యాఖ్యలు సైతం దేశీయ మార్కెట్లకు సానుకూలత సంతరింపజేశాయని ప్రముఖ విశే్లషకుడు వినోద్‌నాయర్ పేర్కొన్నారు. కాగా రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో వాహన, బ్యాంకెక్స్, ఫైనాన్స్, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ, లోహ, హెల్త్‌కేర్, విద్యుత్ రంగ సూచీ 2.93 శాతం లాభాలను నమోదు చేసింది. అలాగే బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.77 శాతం లాభపడ్డాయి. మిశ్రమ ఫలితాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియాఖండ దేశాల స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమ ఫలితాలు నమోదు చేశాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. ప్రస్తుతం జరుగుతున్న రేట్ల యుద్ధానికి ముగింపు పలికేలా త్వరగా చర్చలకు అమెరికా తుదిరూపం ఇవ్వాలని చైనా కోరడం మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేసిందని ట్రేడర్లు చెప్పారు. కాగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం 24 పైసలు పెరిగి ఇంట్రాడేలో 71.19గా ట్రేడైంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 0.24 శాతం తగ్గి బ్యారెల్ 59.28 డాలర్ల వంతున ట్రేడైంది.