బిజినెస్

తెలుగులోనూ హెచ్‌డీఎఫ్‌సీ వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 20: హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తన వెబ్‌సైట్‌ను ఆరు ప్రధాన భారతీయ భాషల్లోకి మార్చి లోకలైజ్ చేసింది. ఆంగ్ల మాధ్యమానికి ఇది అదనపుసౌకర్యమని, గృహ కొనుగోలు దారులకు అందుకు సంబంధించిన రుణ సదుపాయాలపై సమాచారం అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని ఆదివారం నాడిక్కడ ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈమేరకు ఇక ఆంగ్లంతోబాటు హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ఫైనాన్స్ కంపెనీ వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఎక్కువ మంది వినియోగించుకుంటున్న భారతీయ వెబ్‌సైట్‌గా గణుతికెక్కిన ఈవెబ్‌సైట్‌కు తాజామార్పులతో మరింతగా ఆదరణ పెరుగుతుందని విశే్లషకులు చెబుతున్నారు. మారిన ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ సదుపాయాలను, కంటెంట్లను తమ కంపెనీ వినియోగించుకుంటోందని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రేణుసూద్ కర్నాడ్ తెలిపారు. ఇలా స్థానిక భాషల్లో సమచారం అట్టడుగు వర్గాలకు కూడా అందుతుందన్నారు. ఇప్పటికే తమ కంపెనీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, తక్కువ ఆదాయ వర్గాలకు రుణాల కేటాయింపులో అగ్ర స్థానంలో నిలిచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి పురస్కారాన్ని సైతం అందుకుందన్నారు. అలాగే మధ్యతరగతి ఆదాయ వర్గాల సేవలో రెండో స్థానంలో ఉందని ఆమె తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ద్వారా తొలిసారి గృహ రుణ సదుపాయం పొందిన లబ్ధిదారులకు గత మేనెలలో ఒక్కొక్కరికి 1.1 లక్షల వంతున మొత్తం రూ. 2,345 కోట్ల సబ్సిడీని పంపిణీ చేశామన్నారు.