బిజినెస్

అమ్మకానికి ఎయిర్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విమాన యాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’లోని 100 శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే నెలలో ప్రాథమిక బిడ్స్ ఆహ్వానించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని, దీనిపై ఇప్పటికే కొన్ని సంస్థలు ఆసక్తిని తెలియజేశాయని ఆదివారం నాడిక్కడ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియాకు రూ. 58 వేల కోట్ల అప్పులున్నాయి. కొన్నివేల కోట్ల నష్టాలతో ఈ విమానయాన సంస్థ సతమవుతోంది. ఈక్రమంలో ఈ సంస్థను కొనుగోలు చేసి నడిపేందుకు సైతం కొన్న సంస్థలు (ఎక్స్‌పెషన్ ఆఫ్ ఇంటరెస్ట్) ఆసక్తిని వ్యక్తం చేశాయి. దీంతో ఈఓఎల్ బిడ్స్‌ను ఈనెలాఖరులో లేదా వచ్చే నెలలో ఆహ్వానించడం జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. ఈదఫా కొత్తగా ‘ఈ-బిడ్డింగ్’ విధానాన్ని ఇందుకోసం అనుసరించనున్నట్టు తెలిపాయి. కాగా గత వారం పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సింగ్ కరోలా ఎయిర్ ఇండియా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకించి ఈనెల 22న జరుగనున్న ఎయిర్‌లైన్ బోర్డు సమావేశం నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రదీప్‌కుమార్ అధికారులతో చర్చించడం జరిగింది. గడచిన మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత పద్దు స్టేట్‌మెంట్‌ను ఖరారు చేసేందుకుగాను బోర్డు సమావేశంలో నిర్ణయం జరుగనుంది. కాగా ఈనెల తొలివారంతో ఎయిరిండియా యాజమాన్యం ఆ సంస్థకు చెందిన ట్రేడ్ యూనియన్లతో సమావేశమై చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ప్రైవేటైజేషన్ ప్రతిపాదనను చర్చకు తేగా మేజారిటీ శాతం యూనియన్లు ప్రైవేటైజేషన్‌ను వ్యతిరేకించాయి. ఈక్రమంలో రూ. 30వేల కోట్ల అప్పులను తిరిగి చెల్లించేందుకుగాను ఎయిర్ ఇండియా అస్సెట్ హోల్డింగ్ లిమిటెడ్ (ఏఐఏహెచ్‌ఎల్), ప్రత్యేక కార్యక్రమాల వాహనానికి సంబంధించి బాండ్లను జారీ చేసే కార్యక్రమాన్ని కొనసాగించి నిధులు సమీకరించాలని నిర్ణయించారు.
ఏఐఏహెచ్‌ఎల్ గిడ్డంగుల నుంచి సమీకరించిన వర్కింగ్ కేపిటల్ రుణాలకు ఎయిర్ ఇండియాలోని ఇతర విభాగాలకు సంబంధం లేదు. ఎయిర్ ఇండియాకు ఎయిర్ ఇండియా ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్‌లైన్ అల్లైడ్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ సైతం అనుబంధ సంస్థలే. పెయింటింగ్స్, ఆర్ట్ఫో్యక్ట్స్ విభాగాలతోబాటు ఇవికూడాప్రాధాన్యతా రహిత ఆస్తులు. వీటికి సంబంధించి గత సెప్టెంబర్ 16న బాండ్ల జారీ ద్వారా రూ. 2,985 కోట్ల రూపాయలు ఎయిర్ ఇండియా సమీకరించింది.