బిజినెస్

నిరీక్షణ.. షరా మామూలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ప్రపంచ వ్యాప్తంగా గాడ్జెట్ ప్రియులను తీవ్రంగా ఊరిస్తున్న ఐఫోన్-7, ఐఫోన్-7 ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్లను ఆపిల్ సంస్థ బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆవిష్కరించింది. 60 వేల రూపాయల ప్రారంభ ధరతో ఈ నెల 16వ తేదీ నుంచి అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, చైనా తదితర దేశాల్లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్లను కొనుగోలు చేయాలంటే భారతీయులు వచ్చే నెల 7వ తేదీ వరకు ఆగాల్సిందే. సిల్వర్, గోల్డ్, రోజ్‌గోల్డ్ రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా రూపొందించిన ఐఫోన్-7, ఐఫోన్-7 ప్లస్ ఫోన్లు 32జిబి, 128జిబి, 256జిబి స్టోరేజీ సామర్ధ్యంతో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే సరికొత్త జెట్ బ్లాక్ రంగులో రూపొందించిన ఐఫోన్-7, ఐఫోన్-7 ప్లస్ హ్యాండ్‌సెట్లు మాత్రం 128జిబి, 256జిబి సామర్ధ్యంతో మాత్రమే లభ్యమవుతాయి. ఐఫోన్-7ను త్రీడీ టచ్‌తో కూడిన 4.7 అంగుళాల డిస్‌ప్లేతో రూరొందించగా, ఐఫోన్-7 ప్లస్‌ను త్రీడీ టచ్‌తో కూడిన 5.5 అంగుళాల రెటీనా హెచ్‌డి (హై-డెపినిషన్) డిస్‌ప్లేతో తీర్చిదిద్దారు. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో సరికొత్త క్వాడ్‌కోర్ ఆపిల్ ఎ-10 ఫ్యుజన్ ప్రాసెసర్‌ను అమర్చామని, కనుక ఇంతకుముందు తరం ఫోన్లతో పోలిస్తే ఐఫోన్-7, ఐఫోన్-7 ప్లస్ 40 శాతం అధిక వేగంతో పనిచేస్తాయని ఆపిల్ సంస్థ పేర్కొంది. ఐఓఎస్-10తో పనిచేసే ఈ రెండు ఫోన్లకు ముందువైపు ఒకే విధమైన 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను అమర్చగా, ఐఫోన్-7లో వెనుకవైపు 4కె రిజల్యూషన్‌తో వీడియో రికార్డింగ్ చేసుకునేందుకు వీలైన 12 మెగాపిక్సెల్ ఐసైట్ కెమెరాను, ఐఫోన్-7 ప్లస్‌లో టెలీఫొటో లెన్స్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరాలను అమర్చారు.
ఇదిలావుంటే, ఈ రెండు స్మార్ట్ఫోన్లతో పాటు అత్యాధునిక ఫీచర్లతో కూడిన తదుపరి తరం స్మార్ట్‌వాచ్ సిరీస్-2ను కూడా ఆపిల్ ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరెన్నిక గన్న ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ ‘నైక్’తో కలసి రూపొందించిన ఆపిల్ వాచ్ నైక్+ వచ్చే నెల చివరి నుంచి భారత్‌తో పాటు మరికొన్ని ఇతర దేశాల్లో అందుబాటులోకి వస్తాయి. 32,900 నుంచి 34,900 రూపాయల ధరతో ఇవి లభ్యమవుతాయి.

chitram.. ఐఫోన్-7 ప్లస్, ఐఫోన్-7