బిజినెస్

పల్లెపల్లెలో పరివర్తన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చిన్న పట్టణాలు, నగరాలు సహా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతస్థాయి పరివర్తన తీసుకురావడానికి డిజిటల్ ఇండియాను వినియోగించుకోవాలని ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. చిన్న పట్టణాలు, నగరాల్లో మరిన్ని అవకాశాలను, ఉపాధి మార్గాలను తెరిచే విధంగా డిజిటల్ ఇండియాను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పిలునిచ్చారు. ఎలక్ట్రానిక్ సమాచార టెక్నాలజీ స్టార్టప్ సమ్మిట్‌ను ఉద్దేశించి సోమవారంనాడు ఇక్కడ మాట్లాడిన ఆయన హెల్త్‌కేర్, విద్య, కొత్త పారిశ్రామికవేత్తలను సృష్టించడం సహా అనేక అంశాల్లో డిజిటల్ ఇండియా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మొబైల్ చెల్లింపుల యాప్ భీమ్ రెండో దశ భీమ్ 2.0ను ఈ సందర్భంగా ప్రారంభించిన ఆయన ఈ కొత్త యాప్‌లో ఎన్నో వినూత్న అంశాలు ఉన్నాయని, దీని వినియోగ సామర్థ్యం ఎంతగానో విస్తరించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన భారత సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల రిజిస్ట్రీని కూడా ప్రారంభించారు. భారత సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల వివరాలను ఇందులో సమగ్ర రీతిలో పొందుపరుస్తారు. దేశంలో సామాజిక స్టార్టప్‌ల అవసరం ఎంతో ఉందని పేర్కొన్న రవిశంకర్ ప్రసాద్ వీటిని విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, తద్వారా భారతదేశ డిజిటల్ విస్తృతి శక్తిని ప్రపంచానికి తెలియజేయాలని అన్నారు. టెక్నాలజీ వేదికలైన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్), జీఎస్‌టీ నెట్‌వర్క్ వంటివి ఎంతో పురోగతిని సాధించాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రభుత్వ సంస్థలైన ఎన్‌ఐసీ, ఎస్‌టీపీఐ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీతత్వాన్ని సంతరించుకోవాలని అన్నారు. డిజిటల్ ఇండియా అనుకున్న స్థాయిలో విజయం సాధించాలంటే ప్రభుత్వ సంస్థలు కూడా తదనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని అన్నారు. దేశంలోని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ కూడా మరింతగా పోటీ తత్వాన్ని సంతరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. డిజిటల్ గ్రామాల కార్యక్రమానికి తోడ్పాటు అందించాలని టెక్నాలజీ కంపెనీలకు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రానున్న కొన్ని సంవత్సరాల వ్యవధిలో తమ ప్రభుత్వం లక్ష డిజిటల్ గ్రామాలను ఏర్పాటు చేయబోతోందని, ఇందుకు టెక్నాలజీ కంపెనీలు సహకరించాలని ఆయన కోరారు. భారతదేశం పేటెంట్లు, మేధోహక్కులకు ప్రధాన కేంద్రంగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన పేటెంట్ల మంజూరుకు సంబంధించిన గడువును గరిష్ఠస్థాయిలో ఏడాదికి కుదించాలని అన్నారు. ప్రస్తుతం ఇందుకు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వ్యవధి పడుతోందని పేర్కొన్న ఆయన ఏడాదిలోనే కొత్త ఉత్పత్తులకు సంబంధించిన పేటెంట్లను ఏడాదిలోనే మంజూరు చేయడానికి వీలుగా వ్యవస్థను తీర్చిదిద్దాలని అన్నారు.
*చిత్రం... న్యూఢిల్లీలో సోమవారం జరిగిన స్టార్టప్ సమ్మిట్‌లో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్