బిజినెస్

స్వతంత్ర అంతర్గత ఆడిటింగ్ సంస్థతో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్‌పరేఖ్‌పై అవినీతి ఆరోపణలతో రావడంతో దీనిపై స్వతంత్ర అంతర్గత ఆడిటర్ల అకౌంటింగ్ సంస్థ (ఈవై)తో విచారణ జరిపించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఐటీ దిగ్గజ సంస్థలో అంతర్గతంగా సాగుతున్న కోల్డ్‌వార్‌తో రెండేళ్ల క్రితమే అప్పటి అధినేత విశాల్ సిక్కా కంపెనీ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోవడం జరిగింది. కాగా తాజాగా సీఈవోపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపే బాధ్యతలను స్వతంత్ర సంస్థ ‘షర్దుల్ అమర్చంద్ మంగళ్‌దాస్ అండ్ కో’కు అప్పగించడం జరిగిందని ఇన్ఫోసిస్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు నందన్ సిలేకని మంగళవారం నాడిక్కడ తెలిపారు. గత సెప్టెంబర్ 20న కొంతమంది అజ్ఞాత ఉద్యోగుల బృందం కంపెనీ బోర్డుకు రాసిందిగా చెబుతున్న ఈలేఖలో సీఈవోపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిగ్గుదేలుస్తామన్నారు. సీఈవో పరేఖ్‌తోబాటు, చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ కొన్ని అతిపెద్ద కాంట్రాక్టులకు సంబంధించి అధిక ఆదాయాలు సమకూరినట్టు వత్తిడితీసుకువచ్చి త్రైమాసిక ఫలితాల్లో నమోదు చేయించారని ఆ లేఖలో ఆరోపించారు. దీంతో 16 శాతం (రూ. 1278.90) నష్టపోయిన ఈ కంపెనీ వాటా విలువ 2013 నాటి కనిష్ట స్థాయి రూ.639.85కి పడిపోయింది. కాగా ఒక బోర్డు సభ్యుడికి ఇందుకు సంబంధించిన ఆరోపణలతో కూడిన రెండు లేఖలు గత సెప్టెంబర్ 30న వచ్చాయని ఇన్ఫోసిస్ చైర్మన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో సీఈవోపై అవినీతి ఆరోపణలతో కూడిన లేఖ సెప్టెంబర్ 20 తేదీతో ఉండగా ‘అజ్ఞాత ఉద్యోగుల బృందం’ పేరిట ఉన్న మరోలేఖపై సరైన తేదీలు కూడా లేవని తెలిపారు. ఈనెలలో గత 11న బోర్డు సమావేశం జరుగగా అప్పటి నుంచి ఆడిట్ కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపే బాధ్యతలను స్వతంత్ర అంతర్గత ఆడిటర్ల (ఈఎంఎస్‌టీ అండ్ యంగ్) సంస్థకు అప్పగించేందుకు చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఈక్రమంలోనే ఈనెల 21న ‘షర్దుల్ అమర్‌చంద్ మంగళదాస్ అండ్‌కోకు ఈ బాధ్యతలను అప్పగించామన్నారు. అలాగే వాషింగ్టన్ డీసీ అజ్ఞాత ఉద్యోగుల బృంద రక్షణ కార్యక్రమ విభాగానికి తమ కంపెనీకి అంది న ‘అజ్ఞాత ఉద్యోగుల లేఖ’ను పంపడం జరిగింద ని నిలేకని తెలిపారు. ఇందుకు సంబంధించి అంది న ఫిర్యాదు, ఈమెయిల్స్, వాయిస్ రికార్డింగ్‌లు కూడా ఉన్నాయని సూత్రప్రాయంగా దీనిపై విచార ణ జరుగుతుందని తెలిపారు. ఇందులోప్రధానంగా సీఈవో అమెరికా, ముంబయి వంటి ప్రాంతాలకు చేసిన టూర్లపైనే ఆరోపణలున్నాయని తెలిపారు.