బిజినెస్

ప్రత్యక్ష లబ్ధి బదిలీ ద్వారా రైతులకు ఎరువుల సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఎరువులపై రైతులకు ఇస్తున్న రాయితీలను ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డిబిటి) ద్వారా అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ వెల్లడించారు. ఈ కమిటీ మూడు నెలల్లోగా నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో గురువారం ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు నేరుగా ఎరువుల సబ్సిడీలను అందజేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 14 జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించిందని రబీ సీజన్‌లో ఈ ప్రాజెక్టును మరో 14 జిల్లాలకు విస్తరించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఫలితాలను ఆధారంగా చేసుకుని దేశ వ్యాప్తంగా రైతులకు నేరుగా ఎరువుల సబ్సిడీలను అందజేసేందుకు ప్రత్యక్ష లబ్ధి బదిలీని అమలు చేయాలా? లేదా? అనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సిన్హా పేర్కొన్నారు.