బిజినెస్

రైతుల నుంచి నేరుగా పప్పులు కొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పప్పు్ధన్యాలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం భరోసా ఇచ్చింది. అంతేకాకుండా ప్రజలకు చౌకధరలకే పప్పు్ధన్యాలను సరఫరా చేసేందుకు వీలుగా పెద్ద మొత్తంలో నిల్వలను ఏర్పాటు చేసుకునేందుకు రైతుల నుంచి నేరుగా కందులు, మినుములు, పెసలను కొనుగోలు చేయాలని నాఫెడ్ సహా వివిధ కొనుగోలు సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. నిత్యావసర వస్తువుల ధరలను, ప్రధానంగా పప్పు్ధన్యాల ధరలను, వాటి లభ్యతను సమీక్షించేందుకు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి పికె.సిన్హా గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ధరల పర్యవేక్షణా వ్యవస్థను బలోపేతం చేసి ప్రస్తుత పండుగల సీజన్‌లో ప్రజలకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆయన ఆదేశించారు.
అక్రమ నిల్వదార్లకు
పాశ్వాన్ హెచ్చరిక
ఇదిలావుంటే, దేశంలో ఈ ఏడాది పప్పు్ధన్యాల ఉత్పత్తి గణనీయంగా ఉంటుందని, దీంతో వాటి ధరలు దిగివస్తాయని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్రమంగా దాచిన నిల్వలను వెంటనే మార్కెట్‌కు తరలించాలని, లేదంటే భారీగా నష్టపోవడం ఖాయమని ఆయన బ్లాక్‌మార్కెటీర్లను హెచ్చరించారు.