బిజినెస్

అంతర్జాతీయ మార్కెట్‌లో అరకు కాఫీకి పెరుగుతున్న ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 28: అంతర్జాతీయ మార్కెట్‌లో అరకు కాఫీకి విశేష ఆదరణ లభిస్తోంది. పారిశ్రామిక సదస్సులకు కేంద్ర బిందువుగా ఉన్న విశాఖ నగరంలో గతంలో జరిగిన అనేక జాతీయ స్థాయి కార్యక్రమాల్లో అరకుకాఫీకి విశిష్ట స్థానం లభించి ప్రపంచ దేశాలకు ఇక్కడి అరకుకాఫీ రుచి చూసినట్టు అయ్యింది. షాపింగ్‌మాల్స్, ఆన్‌లైన్ మార్కెటింగ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టాళ్ళ ద్వారా నిర్వహించే అమ్మకాలకు ఆదరణ లభిస్తోంది. దీంతో విశాఖ ఏజెన్సీలోని అరకు, డుంబ్రిగుడ, పాడేరు, చింతపల్లి, సీలేరు, గూడెం కొత్తవీధి, తాజంగి, ముంచింగ్‌పుట్ తదితర మండలాల పరిధిలో దాదాపుగా లక్ష ఎకరాల్లో కాఫీ పంటను ప్రోత్సహించడం ద్వారా గిరిజన రైతులను ఆదుకోవాలని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ గిరిజన సహకార సంఘాలను ఏర్పాటు చేసి వీటి ద్వారా రైతు సభ్యులను ఏర్పాటు చేసి కాఫీ పంటను ప్రోత్సహించడమనేది గత అయిదేళ్ళుగా జరుగుతూనే ఉంది. గత అయిదేళ్ళ కాలంలో నాలుగు నుంచి అయిదు వేల టన్నులకు పైగా కాఫీ గింజలు అందుబాటులోకి వచ్చినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వెయ్యి టన్నులకు పైగా కాఫీ దిగుబడి జరిగింది. దీనిని వివిధ గ్రేడ్‌లుగా విభజించి పౌడర్ రూపంలో అందుబాటులోకి తీసుకువస్తోన్న జీసీసీ గత రెండేళ్ళుగా ఏపీ, తెలంగణా ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాల్లో ‘అరకు కాఫీ’ స్టాళ్ళను ఏర్పాటు చేయగలుగుతోంది. ఏపీలో గత ఏడాది కాలంగా నడుస్తోన్న స్టాళ్ల ద్వారా అరకు కాఫీని దేశ, విదేశీ పర్యాటకులు, పారిశ్రామికవేత్తలకు రుచి చూపించగలుగుతోంది. ఇదే తరహాలో తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో స్టాళ్ళ ఏర్పాటు చేయగలిగింది. రానున్న రోజుల్లో మరికొన్ని విమానాశ్రయాల్లో అరకు కాఫీ స్టాళ్ళ ఏర్పాటు కోసం కేంద్ర విమానయానమంత్రిత్వశాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉందని సంబంధితాధికారి ఒకరు తెలిపారు. ఈ విధంగా దశలవారీగా విమానాశ్రయాలు, ఆర్టీసీకాంప్లెక్స్‌లు, షాపింగ్‌మాల్స్, సినిమాహాళ్ళ వద్ద అరకు కాఫీ స్టాళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా దీనిని రుచి చూపించాలని ఈ విధంగా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఆన్‌లైన్ మార్కెట్ చేస్తుండగా దీనికి ఆదరణ లభిస్తోంది. దీనిని దృష్టిలోపెట్టుకుని భారతదేశంలో ఏపీ, తెలంగాణా ప్రాంతాలతోపాటు ఒడిశా, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో జీసీసీ అరకు కాఫీ రుచిని చూపించాలనే క్రమంలో యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విధంగా చేయాలంటే జిల్లాలో కాఫీ పంటను విస్తరించాల్సి ఉంది. గిరిజన రైతులను ప్రోత్సహించడం ద్వారా పంటను పెంచుకుంటూ క్రమేపీ అంతర్జాతీయ మార్కెట్‌ను విస్తృతపరచాలనేది లక్ష్యంగా చేసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే కాఫీ పౌడర్‌ను మూడు లక్షల ప్యాకెట్ల ద్వారా విక్రయించగా ఒక్క దీని ద్వారానే రెండు కోట్ల మేర ఆదాయాన్ని రాబట్టగలిగింది. కాగా ప్రపంచ దేశాలన్నింటికీ బ్రెజిల్ నుంచే కాఫీ గింజలు, పౌడర్ ఎక్కువ శాతంలో సరఫరా జరుగుతోంది. దీంతో కాఫీ దిగుబడిలో ఎపుడూ ప్రపంచ దేశాల్లోనే బ్రెజిల్ నెంబర్ వన్ స్థాయిలో ఉంటోంది. ఇక దేశంలో కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా కాఫీ దిగుబడి ఆశించిన స్థాయిలోనే ఉంటోంది. గింజలను పౌడర్ చేసి, ఆయా క్యాటగిరీలుగా ప్యాకేట్లను తయారు చేసి మరీ విక్రయించే విధంగా బెంగళూరులో మార్కెట్ విధానాన్ని అభివృద్ధి చేశారు.