బిజినెస్

కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వడ్డీ రేట్లపై అమెరికన్ ఫెడరేషన్ నిర్ణయం, దేశీయంగా కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ప్రధానంగా ఈ వారం స్టాక్ మార్కెట్ల తీరును నిర్ధేశిస్తాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. దీపావళి పర్వదిన సందర్భంగా సోమవారం ఒక రోజు సెలవుతో కూడిన ఈ వాణజ్య వారం మూడు రోజులే స్టాక్‌మార్కెట్లు పనిచేస్తాయి. ప్రధానంగా ఈ వారంలో వాహన కంపెనీలు త్రైమాసిక ఫలితాలు వెలువరించనున్నాయి. పండుగ సీజన్ ఆ కంపెనీలకు ఎంతవరకు కలిసొచ్చిందన్న విషయం ఈ సందర్భంగా తేటతెల్లం అవుతుంది. కాగా అర్థికాభివృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని బుధవారం జరుగనున్న అమెరికా ఫెడ్ ద్రవ్య వినిమయ సమావేశం కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచేందుకే అమెరికన్ ఫెడ్ ప్రాధాన్యతనిస్తుందని విశే్లషకులు చెబుతున్నారు. తదుపరి మదపర్లు బ్రెగ్జిట్ డీల్, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. కాగా ఈవారం యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఓసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను వెలువరించనున్నాయి. అలాగే తయారీ రంగానికి చెందిన మాస ఫలితాలు సైతం శుక్రవారం విడుదల కానున్నాయి. వీటితోబాటు రూపాయి విలువ, చమురు ధరలు సైతం మార్కెట్ల తీరుతెన్నులను, పెట్టుబడుల రాకపోకలను నిర్ధేశిస్తాయని విశే్లషకులు పేర్కొంటున్నారు. గడచిన ఆదివారంతో ముగిసిన హిందూ సంవత్ 2076 (దీపావళి నుంచి దీపావళి వరకు) ఏడాదిలో సెనె్సక్స్ 192 పాయింట్లు లాభపడి 39,250కి చేరుకోవడం శుభపరిణామం.