బిజినెస్

డిజిటల్ సేవలు బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అన్ని డిజిటల్ వ్యవహారాల నిర్వహణకు ఓ ప్రత్యేక అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేయబోతోంది. సంస్థలో పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రత్యేక విభాగం రూపుదిద్దుకోబోతోంది. ఆర్‌ఐఎల్ తన అధీనంలోని టెలికాం, డిజిటల్ వాణిజ్యాన్ని పునర్‌వ్యవస్థీకరించే పనిలో ఉంది. ప్రధానంగా ఆస్తులకు సంబంధించిన మానిటరైజేషన్‌ను, రుణాల కుదింపువ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆ సంస్థ కసరత్తు చేస్తోంది. ఈమేరకు సోమవారం నాడిక్కడ విడుదలైన అంతర్జాతీయ సంస్థ ‘మోర్గాన్ స్టాన్లీ’ అధ్యయన నివేదిక వెల్లడించింది. సంస్థలోప్రస్తుతం ఏకీకృత రుణంలో ఎలాంటి మార్పులూ లేకుండా ఉంది. ఐతే ఈ వేదికను పెట్టుబడులకు అనుగుణంగా మార్చుకోవాలని సంస్థ భావిస్తోంది. కార్పొరేట్ విధివిధానాలు, నిర్మాణాత్మకతలో స్పష్టత ఉంటే అది మూలధనాభివృద్ధికి దోహదం చేస్తుందని నివేదిక పేర్కొంది. ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐఎఫ్‌ఎల్)కు చెందిన ఈ సంస్థాగత ఈక్విటీ సంస్థ ఇటీవల నిర్వహించిన అధ్యయన నివేదికలో పలు సూచనలు చేయగా అందులోప్రధానమైంది టెలికాం విభాగం జియోకు చెందిన రుణాన్ని మాతృ సంస్థ అప్పుల జాబితాలోకి బదలాయించడం సబబుగా ఉంటుందని, అలాగే ఓ ప్రత్యేక డిజిటల్ వేదికను ఏర్పాటు చేసి ప్రముఖ వ్యూహాత్మక పెట్టుబడిదారులకు అనుగుణంగా ఉంచాలని ఆ నివేదిక సూచించింది. ఈ మేరకు ఆర్‌ఐఎల్ ఓ ప్రత్యేక డిజిటల్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు గత వారం ప్రకటించింది. ఈక్రమంలో అన్ని డిజిటల్ నిర్వహణలను, యాప్‌లను ఓ సింగిల్ ఎంట్రీ కిందికి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ కొత్త యూనిట్‌లోకి 1.08 లక్షల కోట్ల వాటాలను మళ్లించనున్నట్టు ప్రటించింది. ఈసరికొత్త విభాగంతో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ సేవల వేదిక కలిగిన కంపెనీగా తమ సంస్థ ఆవిర్భవిస్తుందని ఆ సంస్థ తెలిపింది. ప్రధానంగా ఆరోగ్య రక్షణ (హెల్త్‌కేర్), విద్యా రంగాల్లో సరికొత్త సాంకేతికాభివృద్థికి ఈ కొత్త విభాగం సేవలను కొనసాగిస్తుందని, అలాగే కృత్రిమ మేథ వంటి నెక్స్ట్ జనరేషన్ పోటీకి అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తుందని, అలాగే బ్లాక్‌చైన్, వాస్తవికత, అభివృద్ధి అంశాల్లో ఇతరులకు దీటుగా సంస్థ రూపొందుతుందని తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా మైజియో, జియోటీవీ, జియో సినిమా, జియోన్యూస్, జియో సావన్‌లను తీర్చిదిద్దుతామని తెలిపిం ది. వచ్చే 2020 మార్చి 31 నాటికి వాస్తవిక నికర రుణ రహిత సంస్థగా (స్పెక్ట్రం రుణాలు మినహా) తమ సంస్థ మారుతుందని తెలిపింది.