బిజినెస్

ఏపి శాసన మండలిలో జిఎస్‌టికి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: జీఎస్టీ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసన మండలి గురువారం ఆమోదించింది. అంతకుముందు మండలి చైర్మన్ చక్రపాణి అధ్యక్షతన సభ ప్రారంభం కాగానే ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రధాన రాజకీయ పక్షాలు కోరాయి. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అలక్ష్య వైఖరిని ప్రదర్శించిందని అధికార పక్షం మినహా మిగతా విపక్షాలన్నీ ఆరోపించాయి. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ దశలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ ఎపీకి హోదా సాధించేందుకు సిఎం ఎంతో కృషి చేస్తున్నారని, ఈ విషయంలో సిఎం ప్రకటన చేస్తారన్నారు. అప్పటికి శాంతించని ప్రతి పక్షపార్టీల నాయకులు సభ నుండి వాకౌట్ చేశారు. అనంతరం ఛైర్మన్ చక్రపాణి ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. ముందుగా సభ్యుడు ముద్దుకృష్ణమనాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి గంటా శ్రీనివాస్ సమదానమిస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం క్రింద రాష్ట్ర ఉన్నత విద్యా శాఖకు కేంద్రప్రభుత్వం కేంద్ర విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసిందన్నారు. పురాతన దేవాలయాలకు ధూప దీప నైవేద్యం పథకానికి ప్రతి నెల రూ.5వేల చొప్పున అందజేయడం జరుగుతుందని, వేదాలు, ఆగమ పాఠశాలలను నిర్వహించడం, అర్చకులకు శిక్షణ ఇవ్వడం, యాజ్ఞాలు, యాగాలు నిర్వహించటం వంటి హందూ ధార్మిక కార్యకలాపాలను ప్రోత్సహించడం జరుగుతుందని మంత్రి మాణిక్యలరావు ఎమ్మెల్సీ గుండుమల తిప్పిస్వామి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. దేవాదాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న సర్వశ్రేయోనిధి క్రింద మూడు కేటగిరీల కార్యకలాపాల కోసం ఇప్పటి వరకు రూ.147.52 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. టిటిడి-దేవాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బిసి, ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో రూ.50కోట్లతో దేవాలయాలను నిర్మిస్తున్నామన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.710 కోట్లు కేటాయించిందని మంత్రి పల్లె రఘునాథ్‌రావు తెలిపారు.