బిజినెస్

ముగ్గురు భారత మూలాలున్న సీఈవోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 29: భారత మూలాలు కలిగిన ముగ్గురు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ‘ప్రపంచ అత్యుత్తమ సమర్థ టాప్‌టెన్ సీఈవోల’ జాబితాలో చోటుదక్కింది. ఈమేరకు హార్వర్డ్ బిజినెస్ రివ్యూ (హెచ్‌బీఆర్) మేగజైన్ 2019వ సంవత్సరానికి ప్రపంచంలో అత్యుత్తమ సమర్థతను కనబరుస్తున్న 100 మంది సీఈవోల జాబితాను రూ పొందించింది. అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఎన్‌వీఐడీఐఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాన్సన్ హు యాంగ్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలిచారు. కాగా 10 మంది అత్యుత్తమ సీఈవోల జాబితాలో మూడు స్థానాలను భారత మూలాలున్న సీఈవోలు చేజిక్కించుకున్నారు. ఇందులో 6వ స్థానంలో అడోబ్ సీఈవో శంతను నారాయణ్, 7వ స్ధానంలో మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బాంగా, 9వ స్థానాన్ని మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల ఆక్రమించారు. అలాగే ఈ జాబితాలో భారత సంతతికి చెందిన డీబీఎస్ బ్యాంక్ సీఈవో పీయూష్ గుప్తా 89వ స్థానంలో నిలిచారు. యాపెల్ సీఈవో టిమ్‌కుక్ 62వ స్థానంలో, నైక్ సీఈవో మార్క్ పార్కర్ 20వ స్థానంలో ఉన్నారు. జేపీ మోర్గాన్ చేజ్ చీఫ్ జమీ డిమన్ 23, లాక్‌హీద్ మార్టిన్ సీఈవో మారిలిన్ హెవ్‌సన్ 37, డిస్నీ సీఈవో రాబర్ట్ ఇగర్ 55, సాఫ్ట్‌బ్యాంక్ అధినేత మసాయోషీ సన్ 96వ స్థానాల్లో నిలిచారు. కాగా 2015 నుంచి తమ సంస్థ ఈ ర్యాంకింగ్ తీరులో మార్పులు చేసిందని హెచ్‌బీఆర్ ఈ సందర్భంగా తెలిపింది. ఆర్థికాభివృద్ధిపరంగా సీఈవోల పనితీరుతోబాటు, పర్యావరణ, సామాజిక, పాలనా పరమైన అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. కేవలం ఆర్థికపరమైన పనితీరు ప్రాతిపదికనే అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 2014 నుంచి అగ్ర స్థానంలో నిలుస్తూ వచ్చారని, అయితే ఈ ఏడాది అమెజాన్ పర్యావరణ, సామాజిక, పాలనా (ఈఎస్‌జీ) పరమైన స్కోరును సాధించడంలో విఫలమైందని హెచ్‌బీఆర్ నివేదిక స్పష్టం చేసింది.