బిజినెస్

‘హెరిటేజ్’ విద్యుత్ ప్లాంట్ అనంతపురం జిల్లాలో ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలోని చినహోతూరు గ్రామంలో 2.1 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్రాజెక్టును ప్రారంభించినట్లు హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. ఏడాదికి 5 మిలియన్ యూనిట్లను ఉత్పాదక శక్తి కలిగి ఉంటుందని వెల్లడించింది. ఈ విద్యుత్‌ను గోకుల్ డెయిరీ ప్లాంట్‌కు, చిత్తూరు డైరీ ప్లాంట్‌కు వినియోగిస్తామని హెరిటేజ్ సంస్థ తెలిపింది. సుజ్లాన్ గ్రూప్ కంపెనీ ఈ విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పిందని, ఆధునాతన జనరేషన్ టెక్నాలజీని వినియోగించి పవన విద్యుత్ ప్లాంట్ ను నిర్మించినట్లు తెలిపింది.

రవాణా వాహనాలకు
బీమా ప్రీమియం పెంపు
లారీ యజమానుల సంఘం నిరసన
విజయవాడ, మార్చి 31: భారత దేశ వ్యాప్తంగా రవాణా వాహనాల బీమాకు సంబంధించి థర్డ్‌పార్టీ ప్రీమియం ఈ నెల 29 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పెంపు 15 శాతం నుంచి 40 శాతం వరకు ఉందని అది కూడా ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ‘ఐఆర్‌డిఎ’ ఏకపక్షంగా నిర్ణయం ఉత్తర్వులు జారీ చేయడాన్ని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు తీవ్రంగా నిరసించారు. వెంటనే ఈ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలన్నారు. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన ఖాయమన్నారు. 2016-17 సంవత్సరానికి సంబంధించి థర్డ్ పార్టీ ప్రీమియం పెంపు విషయంపై ఈనెల 21 హైదరాబాద్‌లోని ఐఆర్‌డిఎ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ప్రతినిధులు హాజరయ్యారని ఈ సందర్భంగా ప్రీమియం పెంపు వల్ల రవాణా రంగం కుదేలవుతుందని కూడా చెప్పారు. అసలు ఫ్రాఫిట్ అండ్ లాస్ ఎకౌంట్ పెంచుటకు ప్రామాణికం ఏమిటో వివరాలు అందచేయనున్నాం. అయితే చైర్మన్ ప్రస్తుతం అందుబాటులో లేనందున మళ్లీ ఓ సమావేశం నిర్వహించి అప్పుడు చర్చించి నిర్ణయిస్తామన్నారు. అయితే ఇంతలోనే ఏకపక్షంగా నోటిఫికేషన్ జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉదాహరణకు ఆరు టైర్ల ట్రక్‌కు రూ.19వేల 632 నుంచి 22వేల 577లకు, 10 నుంచి 14 టైర్ల ట్రక్‌కు రూ.19,766లు నుంచి 24,708లకు ఇలా టాక్సీలు, ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాలకు 25 శాతం వరకు పెరిగిందన్నారు.