బిజినెస్

సెనె్సక్స్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 31: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ దూకుడును కొనసాగిస్తున్నది. వరుసగా ఐదో రోజు కూడా లాభాల బాటలోనే పయనించింది. అనుకూల ధోరణుల నేపథ్యంలో సెనె్సక్స్‌తోపాటు, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ కూడా లాభాలను ఆర్జించింది. గురువారం లావాదేవీలు ప్రారంభమైన క్షణం నుంచే వివిధ కంపెనీల స్టాక్స్ లాభాల్లో ట్రేడయ్యాయి. ఒకానొక దశలో సెనె్సక్స్ గతంలో ఎన్నడూ లేని రీతిలో 40,392.22 పాయింట్ల చేరింది. అయితే, చివరిలో భారీ లాభాలను ఊహించిన కొంత మంది మదుపరులు చివరిలో అమ్మకాలవైపు మొగ్గు చూపడంతో తగ్గుముఖం పట్టింది. చివరికి 77.18 పాయింట్లు (0.19 శాతం) పెరిగిన సెనె్సక్స్ 40,129.05 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ 33.35 పాయింట్లు (0.28 శాతం) పెరిగి, 11,877.45 పాయింట్లకు చేరింది.
బీఎస్‌ఈలో ఎస్ బ్యాంక్ వాటాలు అత్యధికంగా లాభాలను సంపాదించాయి. ఆ బ్యాంక్ స్టాక్స్ ఏకంగా 24.03 శాతం లాభాలను ఆర్జించడం విశేషం. ఎస్‌బీఐ 7.69 శాతం, ఇన్ఫోసిస్ 3.79 శాతం, టాటా మోటార్స్ 3.40 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.63 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే, మార్కెట్ లాభాల్లో పరుగులు తీసినప్పటికీ టాటా స్టీల్ వంటి వంటి కొన్ని కంపెనీలకు నష్టాలు తప్పలేదు. ఆ సంస్థ షేర్లు 1.95 శాతం నష్టాలను చవిచూశాయి. మహీంద్ర అండ్ మహీంద్ర 1.77 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.74 శాతం, టాటా మోటార్స్ 1.56 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.48 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. కాగా, ఎన్‌ఎస్‌ఈలోనూ ఎస్ బ్యాంక్ స్టాక్స్ లాభాల బాటలో పరుగులు తీశాయి. 23.94 శాతం లాభాలను సంపాదించాయి. జీ ఎంటర్‌టైనె్మంట్ 10.82 శాతం, ఎస్‌బీఐ 7.76 శాతం, గ్రాసిమ్ 4.60 శాతం, ఇన్ఫోసిస్ 3.78 శాతం చొప్పున లాభాలను ఆర్జించాయి. కాగా, జెఎస్‌డబ్ల్యూ స్టీల్ 2.73 శాతం,, టెక్ మహీంద్ర 2.04 శాతం, టాటా స్టీల్ 1.92 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.72 శాతం, మహీంద్ర అండ్ మహీంద్ర 1.64 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడయ్యాయి.