బిజినెస్

బంగారంపై భయం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: అక్రమ బంగారం నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొస్తోందంటూ వచ్చిన కథనాలను అధికార వర్గాలు కొట్టివేశాయి. అసలు ఇలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని గురువానం నాడిక్కడ వివరణ ఇచ్చాయి. తమ వద్ద ఉన్న అక్రమ బంగారం వివరాలను వ్యక్తులు, సంస్థలు వెల్లడించాలని లేని పక్షంలో ప్రాసిక్యూట్ చేస్తామని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో అధికారులు ఈ వివరణ ఇచ్చారు. అసలు బంగారం అమ్నెస్టీ పథకం ఏదీ ఆదాయం పన్ను విభాగం పరిశీలనలో లేదని వివరించాయి. బడ్జెట్ ప్రక్రియకు ముందు ఈ రకమైన మీడియా కథనాలు రావడం సహజమేనని తెలిపాయి. గతంలో అక్రమ బంగారం వెలికితీతకు చేపట్టిన పథకం.. పరిమితంగానే ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది అంటూ మీడియా వార్తలు స్పష్టం చేశాయి. ప్రజలు, సంస్థలు తమ వద్ద ఉన్న అక్రమ బంగారాన్ని వెల్లడించి దానితో పన్ను కట్టే విధంగా ఈ కొత్త పథకాన్ని రూపొందిస్తున్నారని కూడా ఈ కథనాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం భారతీయుల వద్ద ఉన్న బంగారాన్ని 20వేల టన్నులుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు లెక్కల్లోలేని బంగారాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటే ఇది 25వేల నుంచి 30వేల టన్నుల వరకు ఉండవచ్చునని చెబుతున్నారు. నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంతో 2016 నవంబర్ 8న 500, వెయ్యి రూపాయిల నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, 99.3 శాతం మేర 500, వెయ్యి నోట్లు మళ్లీ బ్యాంకింగ్ రంగంలోకి వెనక్కి వచ్చేశాయి. అంటే 15.41 లక్షల కోట్ల 500, వెయ్యి నోట్లు రద్దు సమయంలో చెలామణిలో ఉన్నాయని.. వీటిలో దాదాపుగా 15.31 లక్షల కోట్లు వెనక్కి వచ్చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.