బిజినెస్

ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంతో మార్కెట్లకు ఊపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను ఫెడరల్ రిజర్వ్ తగ్గించింది. ఈ నిర్ణయం కోసం ఎదురుచూసే క్రమంలో, పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేసిన మదుపరులు మళ్లీ ట్రేడింగ్‌ను ముమ్మరం చేశారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గడంతో, పెట్టుబడులకు ఊతం లభించింది. కేవలం అమెరికాలోనేగాక, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో నడిచాయి. కేవలం భారత స్టాక్ మార్కెట్‌లోకే 1.2 బిలియన్ డాలర్లు (సుమారు 8,500 కోట్ల రూపాయలు) పెట్టుబడులు వచ్చాయి. దీనిని బట్టి, స్టాక్ మార్కెట్లు ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా ఊపందుకున్నాయో ఊహించుకోవచ్చు. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయ ప్రభావం ఎన్ని రోజులు మార్కెట్‌పై ప్రభావం చూపుతుందో చూడాలి.