బిజినెస్

హొండా కార్ల అమ్మకాల్లో 29 శాతం తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: హొండా కార్ల అమ్మకాలు ఈ ఏడాది అక్టోబర్ మాసంలో 29 శాతం తగ్గాయి. గత ఏడాది ఇదే సమయానికి 14,187 యూనిట్ల కార్ల అమ్మకాలు జరిగితే, ఈ ఏడాది 10,010 కార్లు మాత్ర మే అమ్ముడైనట్టు
హొండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సీఐఎల్) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గత నెల 633 కార్లను విదేశాలకు ఎగుమతి చేసినట్టు పేర్కొంది. పండుగలు, ఆ సందర్భంగా ఇచ్చిన భారీ డిస్కౌంట్లు, ఇతరత్రా రాయితీల కారణంగా అమ్మకాలు కొంత వరకైనా పెరిగాయని, లేకపోతే మాంద్యం ప్రభావంతో ఈ మాత్రం సేల్స్ కూడా ఉండేవి కావని వ్యాఖ్యానించింది. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో అమ్మకాలు కొంత మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. త్వరలోనే మళ్లీ పుంజుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేసింది.