బిజినెస్

జియోస్పాటియల్ సేవల్లో సియోంట్ వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, నెట్‌వర్క్స్ ఆపరేషన్స్ సర్వీసుల విభాగంలో ఐటి సేవలను అంతర్జాతీయంగా విస్తరించామని సియోంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. గత 25 సంవత్సరాలుగా చేసిన కృషి ఫలించిందని, జియోస్పాటియల్ సర్వీసు కంపెనీలకు కూడా అవసరమైన ఐటి పరిష్కారాలు అందిస్తున్నామన్నారు. ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ దీని వల్ల అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఇంజనీరింగ్ డిజైన్ సర్వీసులో ముందంజలో ఉన్నట్లు చెప్పారు. డిజైన్ బిల్డ్ మెయింటైన్ వ్యూహాలతో సియోంట్ బ్రాండ్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందన్నారు. గేమ్ చేంజింగ్, కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ డిజైన్లలో కూడా పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు.