బిజినెస్

స్తబ్దుగా టాటా స్టీల్ త్రైమాసిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: టాటాస్టీల్ గురువారం త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గత సెప్టెంబర్ మాసంతో ముగిసిన మూడు నెలల కాలానికి బ్యాంకు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఎదుగూబొదుగూ లేని స్థితిలో స్వల్ప నష్టాలను ప్రకటించింది. మదుపర్ల సానుకూల సెంటిమెంటును సానుకూలంగా మార్చుకోవడంలో సంస్థ విఫలమైంది. వాటాలు బీఎస్‌ఈలో 0.30 శాతం నష్టపోయి ఒక్కో వాటా రూ. 403 వంతున ట్రేడవగా, ఎన్‌ఎస్‌ఈలో 0.40 శాతం నష్టాలతో రూ. 402.80 వంతున ట్రేడైంది. ఆదాయంలో కూడా తగ్గుదల నమోదైంది. బుధవారం ఈ కంపెనీ 5.9 శాతం ఏకీకృత నికర లాభాల వృద్థితో రూ. 3,302 కోట్ల లాభాలను తాజా త్రైమాసికంలో ఆర్జించినట్టు ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 3,116.20 కోట్లు ఆర్జించింది. ఇక ఏకీకృత ఆదాయంలో మాత్రం 15.7 శాతం నష్టపోయి రూ. 34,762.73 కోట్ల సమకూరినట్టు నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ కంపెనీ రూ. 41,257.66 కోట్లు ఆర్జించింది. విక్రయాల్లో తగ్గుదల, ఉత్పత్తుల ధరలు తగ్గడం, తద్వారా డిమాండ్ కూడా తగ్గిపోవడం కారణాలుగా ఆ కంపెనీ పేర్కొంది.