బిజినెస్

4 శాతం లాభపడిన యూకో బ్యాంకు వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: యూకో బ్యాంకు వాటాలు గురవారం 4 శాతం లాభపడ్డాయి. గత సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి ఈ బ్యాంకు రూ. 891.98 కోట్ల నష్టాన్ని నమోదు చేసినప్పటికీ వాటాలపై ఆ ప్రభావం పడకపోవడం గమనార్హం. బీఎస్‌ఈలో ఈ బ్యాంకు వాటాలు 3.64 శాతం లాభపడి ఒక్కోవాటా రూ. 14.23 వంతున ట్రేడైంది. ఓ దశలో ఈ వాటాలు 11.58 శాతం బలపడ్డాయి. ఇక ఎన్‌ఎస్‌ఈలో సైతం ఈ వాటాలు 3.27 శాతం లాభపడి రూ. 14.20గా ట్రేడయ్యాయి. ఇక వాణిజ్య విలువను ప్రాతిపదికన 3.64 లక్షల వాటాలు బీఎస్‌ఈలో నూ, 53 లక్షల వాటాలు ఎన్‌ఎస్‌ఈలోనూ ఇంట్రాడేలో ట్రేడయ్యాయి. ఇక ఈ ప్ర భుత్వ రంగ బ్యాంకు గడచిన ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలల కా లానికి రూ. 1,136,44 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా, తాజాగా అదేకాలానికి రూ. 891.98 కోట్ల నష్టం నమోదైంది. తాజా త్రైమాసికంలోనూ రూ. 4,533.51 కోట్ల ఆ దాయాన్ని నమోదు చేసింది. గడచిన ఏడాది ఇదే కాలంలో రూ. 3,749.18 కోట్ల ఆ దాయం నమోదైంది. ఇక మార్కెట్ విలువ ప్రాతిపదికన సైతం ఈ బ్యాంకు స్థితిగతులు బాగాలేవు. మొత్తం నిరర్థక ఆస్తులు 21.87 శాతం (రూ. 25,665.14 కోట్లు)కు చేరాయి. ఈ త్రైమాసికంలో రూ. 29,581.49 కోట్ల రుణాల పంపిణీ జరిగింది.