బిజినెస్

ఆంధ్రా బ్యాంకు నికర లాభాలు రూ.122 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: ఆంధ్రాబ్యాంకు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ.122 కోట్ల నికర లాభాలు ఆర్జించినట్లు ఆ బ్యాంకు ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభాల్లో 35 శాతం వృద్ధిరేటును సాధించింది. వ్యాపారంలో 5.20 శాతం, డిపాజిట్లలో 5.45 శాతం, అడ్వాన్సుల్లో 5.40 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. రిటైల్ పోర్ట్ఫులియా 5.87 శాతం వృద్ధిని సాధించింది. బ్యాంకుకు మొత్తం 2876 బ్రాంచీలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 749, సబర్బన్‌లో 763, అర్బన్ ప్రాంతాల్లో 652, మెట్రోలో 712 బ్రాంచీలు ఉన్నాయి. దేశం మొత్తం మీద 3,798 ఏటీఎంలు ఉన్నాయి. వ్యక్తిగత రుణాలు రూ.42,179 కోట్లను, హౌసింగ్ రుణాలను రూ.20,643 కోట్లను, వ్యవసాయేతర బంగారు రుణాలు రూ.3,292 కోట్లు, ప్రోపర్టీ టర్మ్ రుణాలు 5,656 కోట్లను ఇచ్చినట్లు బ్యాంకు పేర్కొంది. వ్యవసాయ క్రెడిట్‌ను విశే్లషిస్తే రూ. 35,961 కోట్లను చెల్లించారు. బలహీన వర్గాలకు నిర్దేశించిన పరిమితి పదిశాతానికి మించి 13.62 శాతం మేర రుణాలు ఇచ్చారు. మహిళా లబ్ధిదారులకు 14.89 శాతం మేర పరపతిని కల్పించారు. చిన్న, సన్నకారు రైతులకు 10.77 శాతం మేర రుణాలు చెల్లించారు. చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు రూ.31,553 కోట్ల రుణాలను చెల్లించారు. ఆంధ్రాబ్యాంకుకు ఏపీవై మిషన్ పాజిబుల్ అవార్డు లభించినట్లు బ్యాంకు పేర్కొంది.