బిజినెస్

గత నెలలో 7.4 శాతం పెరిగిన మ్యూచువల్ ఫండ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: గడచిన అక్టోబర్‌లో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల ఆధారిత విలువ 7.4 శాతం పెరిగి రూ. 26.33 లక్షల కోట్లకు చేరింది. భారీగా ఈక్విటీ, ద్రవ్య పథకాల్లోకి నిధులు రావడంతో ఇది సాధ్యమైంది. గడచిన సెప్టెంబర్ మాసంలో ఈ ఆస్తుల విలువ రూ. 24.5 లక్షల కోట్లుగా ఉందని ఆసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా శుక్రవారం నాడిక్కడ తెలిపింది. మ్యూచువల్ ఫండ్ హౌస్‌లకు మొత్తం రూ. 1.33 లక్షల కోట్ల నిధులు గత నెలలో వెల్లువెత్తాయి. ఇందులో ద్రవ్య నిధులు మాత్రమే రూ. 93,200 కోట్లు సమకూరడం గమనార్హం. భారీగా పెరిగిన రీటెయిల్ వాణిజ్యంతోబాటు ఈక్విటీ, లిక్విడ్ ఫండ్స్ పథకాల్లోకి నిధులు భారీగా రావడం జరిగింది.