బిజినెస్

జీవితకాల గరిష్టం నుంచి నష్టాల్లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 8: జీవితకాల రికార్డు గరిష్టం నుంచి శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారాయి. వృద్ధిరేటును దృష్టిలో ఉంచుకుని మనదేశ ఆర్థిక బల (క్రెడిట్) రేటింగ్ అంచనాలను అంతర్జాతీయ అధ్యయన సంస్థ మూ డీస్2 తగ్గించడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. వారం రోజుల ట్రెండ్‌కు కొనసాగింపుగా బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఓ దశలో మరోదఫా ఇంట్రాడే గరిష్టం 40,749.33కు చేరింది. ఐతే మధ్యాహ్నం తర్వాత ఆ పరిస్థితి పూర్తి భిన్నం గా మారింది. లాభాల స్వీకరణ క్రమంలో వేగంగా కిందికి దిగిన ఈ సూచీ చివరికి 330.13 పాయిం ట్లు (0.81 శాతం) నష్టపోయి 40,323.61 పాయిం ట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 103.90 పాయింట్లు (0.86 శాతం) నష్టపోయి 11,908 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో అత్యధికం గా నష్టపోయిన సంస్థల్లో సన్‌పార్మా, వేదాంత, ఓఎన్‌జీసీ, టీసీఎస్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఇవి దా దాపు 4.23 శాతం నష్టాలను సంతరించుకున్నాయి, మరోవైపు యెస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ 3.76 శాతం లాభపడ్డాయి. కాగా కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థికాభివృద్ధికి విఘాతంగా ఉన్న బలహీనతలను పూరించడంలో స్వల్పంగా విఫలమైందని తన అధ్యయన నివేదికలో పేర్కొన్న అంతర్జాతీయ అధ్యయన సంస్థ మూడీస్ దేశ క్రెడిట్ రేటింగ్ అంచనాల్లో తొలిసారిగా కోత విధించింది. అలాగే అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపా యి విలువ తాజాగా 33 పైసలు నష్టపోయి మూడు వారాల కనిష్టానికి చేరడంతో మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం పడి లాభాల స్వీకరణకు దిగారు. రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ, లోహ, సహజవాయువులు, చమురు, హెల్త్‌కేర్, ఐటీ, టెక్, టెలికాం, విద్యుత్ సూచీలు 1.80 శాతం నష్టపోయాయి. స్థిరాస్తి, బ్యాంకెక్స్, వినిమ య వస్తువుల సూచీలు 1.55 శాతం లాభపడ్డాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం 0.79 శాతం లాభాలను సంతరించుకున్నాయి. ఇలావుండగా అంతర్జాతీయ స్థాయి సూచీ 3మోర్గాన్ స్టాన్లీ కాంపోజిట్ ఇండెక్స్ (ఎంఎస్‌సీఐ)లో తాజాగా ఎనిమిది భారీతీయ స్టాక్స్‌కు చోటు లభించింది. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్ మేనేజ్‌మెంట్, ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా), ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఉన్నాయి. ఐతే వొడాఫోన్ ఐడియా, యెస్ బ్యాంక్, బీహెచ్‌ఈఎల్, గ్లెన్‌మార్క్ పార్మాస్యూటికల్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్‌లను ఈ సూచీ తన పరిధి నుంచి తొలగించింది. అలాగే ఎంఎస్‌సీఐ మరో ఏడు స్టాక్స్‌ను తనపరిథిలోకి చేర్చుకుని, నాలుగు స్టాక్స్‌ను తొలగించింది. ఇందులో బెర్గర్ పెయింట్స్, కోల్గేట్, డీఎల్‌ఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, సైరుూమెన్స్ అంతర్జాతీయ సూచీలోకి చేరాయి. ఇక అమెరికా-చైనా చర్చల్లో ఇంకా లోతైన ప్రగతి కనిపించకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్ మార్కెట్లు నష్టాల్లో ముగియగా, టోక్యో లాభాలను సంతరించుకుంది. ఇక ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలతోనే సాగాయి. ముడిచమురు ధరలు 1.24 శాతం తగ్గి బ్యారెల్ 61.53 డాలర్ల వంతున ట్రేడైంది.