బిజినెస్

పసిడి పరుగుకు పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ. 196 తగ్గి మొత్తం ధర రూ. 38,706గా ట్రేడైంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అందించిన వివరాల మేరకు గురువారం 10 గ్రాముల ధర రూ. 38,902 పలికింది. స్టాక్ మార్కెట్ల వైపు మదుపర్లు దృష్టి మళ్లించిన క్రమంలో వెండి ధర సైతం కిలోపై రూ. 956 తగ్గి మొత్తం ధర రూ. 45,498కి దిగివచ్చింది. అలాగే 24 కేరట్ల స్పాట్ గోల్డ్ ధర సైతం రూ.196 తగ్గింది. రూపాయి విలువ తగ్గడం కూడా బంగారం ధర తగ్గేందుకు దోహదం చేసిందని విశే్లషకులు చెబుతున్నారు.
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే వాణిజ్య సమయం ఆరంభమైనప్పటి నుంచి రూపాయి విలువ ఊగిసలాటకు గురై చివరికి 30 పైసలు కోల్పోయి ఇంట్రాడేలో 71.27గా ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం 1,471 డాలర్లుగా, ఔన్స్ వెండి 17.06 డాలర్లుగా ట్రేడయ్యాయి.