బిజినెస్

పారిశ్రామిక వర్గాల హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: అయోధ్యలోని వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమిలో రామ మందిర నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల భారత పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సుప్రీం కోర్టు ధర్మాసనం ఎంతో ధైర్యంగా, చరిత్రాత్మక తీర్పునిచ్చిందని మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం దేశంలోని 130 కోట్ల మంది ప్రజానీకం ఎంతోకాలంగా వేచిచూస్తున్న అంశంపై సమతూకంతో తీర్పునిచ్చిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి సున్నితమైన అంశంపై నిర్ణయాన్ని వెల్లడించడానికి అపారమైన ధైర్యసాహసాలు ఉండాలని అన్నారు. దశాబ్దాల తరబడి దేశాన్ని కుదిపేస్తున్న ఒక కీలక సమస్యను పరిష్కరించిన ఘనత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనానికే దక్కుతుందని తెలిపారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్టు చెప్పారు. పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు డీకే అగర్వాల్, ఫికో మేనేజింగ్ డైరెక్టర్ యూఎస్ అవస్తి తదితరులు కూడా సుప్రీం కోర్టు తీర్పును శ్లాఘించారు.
దేశానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఒక సున్నితమైన సమస్యను అత్యంత సమర్థంగా, అన్ని వర్గాలకు ఆమోద యోగ్యంగా పరిష్కరించిన సుప్రీం కోర్టు ధర్మాసనానికి జాతి యావత్తు జేజేలు పలుకుతున్నదని వేరువేరు ప్రకటనల్లో వ్యాఖ్యానించారు. భారత దేశంలో అన్ని మతాలు, వర్గాల ప్రజలు ఎలాంటి భేదభావం లేకుండా కలిసిమెలిసి ఉంటారని, బాబ్రీ మసీదు- రామ జన్మభూమి వివాదం వల్ల కొన్ని సమస్యలు తలెత్తినా, ఇప్పుడు తీర్పు నేపథ్యంలో తెరపడిందని పేర్కొన్నారు.
ఆహ్వానిస్తున్నా: గోయల్
అయోధ్యపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాను ఆహ్వానిస్తున్నానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశాభివృద్ధికి, ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధికి ఈ తీర్పు ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక రంగంలో అస్తిరత్వానికి తెరపడి, వృద్ధిరేటు పుంజుకోవడానికి మార్గం సుగమమైందని అన్నారు.