బిజినెస్

మార్కెట్లపై అయోధ్య తీర్పు ప్రభావం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 9: వివాదాస్పద అయోధ్య-రామ మందిర్ వివాదానికి తెరదించుతూ శనివారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కనిపిస్తుందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. గత వారం ఇటు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజి (బీఎస్‌ఈ), అటు జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజి (ఎన్‌ఎస్‌ఈ) కొనసాగిన బుల్ రన్‌కు ఈవారం బ్రేక్ పడింది. ఏడు సెషన్స్‌పాటు వరుస లాభాల్లో సాగిన స్టాక్ మార్కెట్లు ఈవారం ఒడిదుడుకులకు లోనైయ్యాయి. అంతర్జాతీయ సూచీలు స్థిరంగా లేకపోవడం, అమెరికా రిజర్వ్ ఫండ్ వడ్డీ రేట్లను సవరించడం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధాన్ని ముగించే దిశగా ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కావాలని నిర్ణయించుకోవడం వంటి పలు అంశాలు స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఒక్కోసారి ఒక్కో రకమైన వార్త వెలువడడంతో మార్కెట్లకు ఆటుపోట్లు తప్పలేదు. లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితిని స్పష్టం చేసింది. ఇలావుంటే, శనివారం అయోధ్యపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పును వెల్లడించిన నేపథ్యంలో, దాని ప్రభావం కేవలం రాజకీయాలకో మరే ఇతర ఒకటిరెండు రంగాలకో పరిమితం కాకుండా, అన్నింటిపైనా ఉంటుందనేది వాస్తవం. శని, ఆది వారాలు స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో, సోమవారం నాటికి సుప్రీం తీర్పు తదుపరి పరిస్థితులు ఎలా ఉండబోతాయోనన్న విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ స్థాయిలో విమర్శలుగానీ, ప్రతిఘటనలుగానీ లేకపోవడంతో మార్కెట్లు సజావుగానే సాగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయోధ్య రామచంద్రుడి జన్మభూమిగానే పరిగణిస్తూ, అక్కడ మందిరాన్ని నిర్మించడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన అనుమతినిచ్చిన తరుణంలో, దశాబ్దాల వివాదానికి తెరపడి, మిగతా అన్ని రంగాల్లో మాదిరిగానే ఆర్థిక రంగంలోనూ కొంత స్థిరత్వం ఏర్పడుతుందనేది వాస్తవం. మొత్తం మీద ఈవారం ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు వచ్చే వారం మెరుగుపడతాయన్నది పరిశీలకుల అభిప్రాయం.