బిజినెస్

లక్ష్మీ విలాస్‌కు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు గల రెండో త్రైమాసికంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ నష్టాన్ని చవిచూసింది. శనివారం బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో 357.18 కోట్ల రూపాయల నికర నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ నష్టం 132.31 కోట్ల రూపాయలుకాగా, ఈ ఏడాది భారీగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ గల మొదటి త్రైమాసికంలో కంపెనీ 237.26 కోట్ల రూపాయల నష్టాలను ఎదుర్కొంది. ద్వితీయ త్రైమాసికంలో స్థూల ఆదాయం 665.33 రూపాయలుకాగా, గత ఏడాది ఇదే కాలానికి ఆదాయం 800.50 కోట్ల రూపాయలు.