బిజినెస్

చమురు, సహజవాయు రంగాల్లో విరివిగా పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబుదాబీ/న్యూఢిల్లీ, నవంబర్ 11: భారత్‌లోని చమురు, సహజ వాయువుల రంగంలో విరివిగా పెట్టుబడులు మదుపు చేయాలని సోమవారం నాడిక్కడ విదేశీ కంపెనీలకు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారైన భారత్ దేశీయంగా చమురు, సహజ వాయువుల ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన వౌలిక వసతులకోసం 100 బిలియన్ డాలర్లు వెచ్చించే ప్రణాళికలతో ముందుకెళుతోందన్నారు. రెండు రోజుల పర్యటన కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వచ్చిన ఆయన సోమవారం అబుదాబీలో జరిగిన ఓ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. భారత్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని, తదుపరి చేపట్టనున్న మరింతగా సంస్కరణలతో కూడిన ప్రభుత్వ విధానాలను, ఇప్పటికే ప్రపంచ మార్కెట్ల చూపు భారత్‌వైపు పడిన వైనాన్ని ఆయన విశదపరిచారు. 2024 నాటికి రీఫైనరింగ్, పైప్‌లైన్లు, సహజ వాయు టెర్మినళ్లు తదితర వౌలిక వసతుల కల్పన కోసం మొత్తం 100 బిలియన్ డాలర్లు వెచ్చించాలన్న ప్రణాళికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. ప్రస్తుతానికి ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కన్నా సురక్షిత దేశం మరొకటి లేదని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. దేశీయంగా రీఫైనరింగ్ సామర్ధ్యం పెంచడం ద్వారా ఇందనం, పెట్రోకెమికల్స్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని భారత్ భావిస్తోందన్నారు. ప్రస్తుతం ఏ ఇంధనం కూడా అతిపెద్ద దేశీయ అవసరాలకు అనుగుణంగా అందుబాటులో లేదన్నారు. ప్రస్తుతం సహజవాయువులు, సంప్రదాయేత ఇంధన తయారీ, వినియోగంపై స్పష్టమైన విధానంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2030 నాటికి దేశీయంగా ఇంధన తయారీని మొత్తం వినియోగంలో 15 శాతం ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని భారత చమురు శాఖ మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఈ తయారీ కేవలం 6 శాతంగానే ఉందన్నారు. రానున్న దశాబ్ధాల్లో భారత్ అంతర్జాతీయ ఇంధన డిమాండ్‌ను పూరించే దేశాల్లో ఒకటిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. భారత్‌లో ఇంధన వినియోగ డిమాండ్ వేగంగా పెరుగుతోందని 2020 నాటికి ఇది రోజుకు 5.05 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుందని, అలాగే 2030 నాటికి 10 మిలియన్ బ్యారెళ్ల చేరుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అలాగే సహజవాయు వినియోగం సైతం మూడు రెట్లు పెరిగి రోజుకు 500 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు చేరే అవకాశం ఉందని, ప్రస్తుతం ఈ డిమాండ్ రోజుకు 150 (ఎంఎంఎస్‌సీఎండీ)గా ఉందని తెలిపారు. 2040 నాటికి అంతర్జాతీయంగా ఇందన డిమాండ్‌లో భారత భాగస్వామ్యం 11 శాతంగా ఉంటుందన్నారు. గడచిన ఐదేళ్లుగా వరుసగా విధాన నిర్ణయాల్లో సంస్కరణలు చేపట్టి భారత హైడ్రోకార్బన్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేసిందని, సరికొత్త లైసెన్సింగ్ విధానాన్ని చమురు, సహజ వాయువుల ఉత్పత్తికి ప్రవేశపెట్టి ధరలను అదుపు చేయడంతోబాటు, మార్కెటింగ్‌లో సైతం సంస్కరణలు చేపట్టినట్టు ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.
*చిత్రం...కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్