బిజినెస్

ఐదు కాదు.. పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రానున్న పది, పదిహేను సంవత్సరాల్లో భారతదేశం పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదన్న విశ్వాసాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యక్తం చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ‘డిఫెన్స్ కనెక్ట్ 2019’ అనే కార్యక్రమాన్ని సోమవారంనాడు ఇక్కడ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన రాజ్‌నాథ్ ప్రస్తుతం దేశంలో అనేక రంగాల్లో ఏర్పడిన స్టార్టప్‌లు చేస్తున్న ఆవిష్కరణలు తనకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు.
వీటిని మరింతగా ప్రోత్సహిస్తే ఎన్నో విజయాలను సాధించేందుకు బలమైన బాట వేసినట్టు అవుతుందని తెలిపారు. 2024కల్లా భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మా ర్చాలన్న లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని గుర్తు చేసిన రాజ్‌నాథ్ సింగ్ ‘ప్రస్తుతం దేశంలో విస్తృతమవుతున్న ఆవిష్కరణలు, పదునెక్కుతున్న నైపుణ్యాన్ని బట్టి చూస్తే రానున్న పది, పదిహేను సంవత్సరాల కాలంలో 10 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించేందుకు ఎంతైనా అవకాశం ఉందన్న నమ్మకం కలుగుతోంది’ అని తెలిపారు. రక్షణ టెక్నాలజీల దిగుమతి అవసరాలను అధిగమించి, వాటిని ఎగుమతి చేసే ప్రధాన దేశంగా భారత్ ఆవిర్భవించబోతోందని, వినూత్న ఆవిష్కరణలకూ కేంద్రం కాబోతోందని ఆయన తెలిపారు. కొత్త ప్రాజెక్టులను చేపట్టే విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత సవాళ్లకు పరిష్కారాన్నీ కనుగొనాలని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు.
పరిశోధన, అభివృద్ధి, ఉత్పాదకత అన్నవి పరస్పర ఆధారిత ప్రక్రియలని పేర్కొన్న రాజ్‌నాథ్ సింగ్ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య కూడా సమన్వయం పెంపొందాలని అన్నారు. రక్షణ పరిశ్రమను పూర్తిగా దేశీరుూకరించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సహాయ సహకారాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రక్షణ రంగంలో సాధించిన వినూత్న ఆవిష్కరణలను ‘డిఫెన్స్ కనెక్ట్’లో ప్రదర్శించారు.

*చిత్రం... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్