బిజినెస్

జీడీపీ వృద్ధిరేటు 4.9 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంగాలో దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 4.9 శాతం వరకూ ఉండవచ్చని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) తన తాజా నివేదికలో అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో 5 శాతంగా ఉన్న జీడీపీ ద్వితీయ త్రైమాసికంలో కోలుకోలేకపోయింది. ఈ పరిస్థితి తదుపరి నెలల్లోనూ కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి, ప్రస్తుత సంవత్సరంలో వృద్ధిరేటు 6.8 శాతం వరకూ ఉండవచ్చని అంచనా వేశారు. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితుల నేపథ్యంలో, అందరి అంచనాలు తారుమారయ్యాయి. వృద్ధిరేటు తగ్గుముఖం పట్టింది. మొదటి త్రైమాసికంలో చేదు అనుభవం ఎదురుకాగా, రెండో త్రైమాసికంలో పరిస్థితి మరికొంత క్షీణించింది. జీడీపీ వృద్ధిరేటు ఎంత వరకూ పడిపోతుంది? మెరుగుపడే అవకాశాలు ఉన్నాయా? లేదా? అనే ప్రశ్నలకు ఒకటిరెండు వారాల్లో స్పష్టత వస్తుందని ఎన్‌సీఏఈఆర్ పేర్కొంది.