బిజినెస్

భగ్గుమన్న ఇరాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెహ్రాన్, నవంబర్ 16: పెట్రోలియం వనరులు ఎక్కువగా ఉన్న ఇరాన్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ ధరను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, వేలాదిగా పౌరులు నిరసనలకు దిగుతున్నారు. దేశంలోని వివిధ ప్రధాన నగరాలు, పట్టణాల్లో శనివారం కూడా నిరసనలు కొనసాగాయి. సెంట్రల్ ఇరాన్‌లోని సిర్గాన్‌లోగల పెట్రోలియం నిల్వ చేసే వేర్‌హౌస్‌పై కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని జాతీయ వార్తా సంస్థ ఇర్నా తెలిపింది. భద్రతాదళాలు వెంటనే స్పందించడంతో భారీ నష్టం తప్పిందని పేర్కొంది. మషాద్, బిర్జాండ్, అవాజ్, గషరాన్, అబాదాన్, కొరమ్‌షహర్, మషాషహర్, షిరాజ్, బండార్ అబ్బాస్ తదితర తదితర పట్టణాల్లోనూ పౌరులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళలు కొనసాగించారు. నిరసన ప్రదర్శనల నేపథ్యంలో శనివారం తెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్ ధరను ఒకేసారి 50 శాతం పెంచుతూ ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ అలజడికి ప్రధాన కారణమైంది. ఇప్పటికే అమెరికా నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వివిధ వస్తుసేవలు ధరలను అమాంతం పెంచేసింది. అందులో భాగంగానే పెట్రోల్ ధరను కూడా పెంచింది. అయితే, ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగానే ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారి పోతున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.