బిజినెస్

అంతర్జాతీయ సూచీలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత వారం సల్ప లాభాలతో బయటపడిన భారత స్టాక్ మార్కెట్లు కొత్త వారంలో ఎలా ఉంటాయన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నుంచి ఇరాన్, ఇరాక్‌లో నెలకొన్న అనిశ్చితి వరకూ, రూపాయ మారకపు విలువ హెచ్చుతగ్గుల నుంచి వివిధ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాల వరకూ ఎన్నో అంశాలు స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. వాటి గమనం ఏ విధంగా ఉంటుందనేదే ప్రశ్న.
*
న్యూఢిల్లీ, నవంబర్ 17: ఈవారం దేశీయంగా ప్రభావితం అయ్యే అంశాలేవీ లేకపోవడం వల్ల స్టాక్ మార్కెట్లు ప్రధానంగా అంతర్జాతీయ స్థితిగతులకు, నమోదయ్యే సూచీలకు అనుగుణంగా లాభనష్టాలను సంతరించుకునే అవకాశాలున్నాయని విశే్లషకులు భావిస్తున్నారు. ప్రధానంగా అమెరికాతో మనదేశానికి ఉన్న వాణిజ్యపరమైన వివాదాల పరిష్కారానికి జరుగుతున్న కృషి ఏ ఫలితాలనిస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇరు దేశాల మధ్య ‘ప్రాథమిక వాణిజ్య ప్యాకేజీ’ రూపకల్పనకు తదిరూపం ఇవ్వడం కోసం అమెరికా వాణిజ్య విభాగం ప్రతినిధి బృందం ఈ వారం మన దేశానికి రానున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏవైనా సానుకూలతలు లేకుంటే దేశీయ మార్కెట్లు ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశాలున్నాయని ప్రముఖ విశే్లషకుడు జుమీద్ మోదీ అభిప్రాయపడ్డారు. అలాగే చైనా ఈవారమే రేట్లపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇక చైనాతో అమెరికా వాణిజ్య చర్చల్లో ఏ ఫలితాలు వస్తాయనేది చూడాల్సివుందని ఆయన అన్నారు. ఈరెండు దేశాలు పరస్పరం విధించుకున్న అదనపు సుంకాలను తగ్గించి మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే వీలుంది. ఇక హాంగ్‌కాంగ్ సిటీలో పెరిగిన ఉద్రిక్తతల క్రమంలో పూర్తిస్థాయి బ్రేక్‌డౌన్ (మూసివేత)ను చేపడతామని అక్కడి పోలీసులు హెచ్చరించడం తాజాగా అంతర్జాతీయ మార్కెట్లు ఆ పరిణామాలపై ప్రభావితమయ్యే అవకాశాలున్నాయన్నారు. ఇలా ఉండగా దేశీయంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు తాజా గణాంకాలు స్టాక్ మార్కెట్లలో మదుపర్ల ప్రోత్సాహాన్ని నీరుగార్చాయి. అయితే ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు చేపడుతున్న ఆర్థిక ఉద్దీపన చర్యలు పెట్టుబడులకు సానుకూలంగా ఉన్నాయన్నది నిర్వివాదాశం. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మరింత పెరగకుండా రిజర్వు బ్యాంకు వృద్ధిరేటును క్రమబద్ధం చేయడంపైనే ప్రధాన దృష్టిని కేంద్రీకృతం చేస్తుందని, మరోదఫా రెపోరేట్ల కోత విధిస్తుందని విశే్లషకులు చెబుతున్నారు.