బిజినెస్

ప్రోత్సాహకాల కోసం పరిశ్రమల ఎదురుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 17: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే ప్రోత్సాహకాలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. దాదాపు రెండేళ్లుగా పరిశ్రమలు ఏర్పాటు చేసినవారు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహకాలను గత ప్రభుత్వం ప్రకటించింది. విశాఖలో 2014 నుంచి 2018 వరకూ నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో చేసుకున్న అవగాహన ఒప్పందాల మేరకు పరిశ్రమలు ఏర్పాటు చేసినవారికి ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రోత్సాహకాలను అప్పటి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆయా పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 2018లో భాగస్వామ్య సదస్సు నిర్వహించే నాటికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీల బకాయిలు పూర్తిగా చెల్లించేందుకు ప్రతిపాదించారు. ఇప్పటివరకూ అన్ని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలు చెల్లించామని చెప్పి మరిన్ని పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నానికి అప్పటి ప్రభుత్వం కసరత్తు చేసింది. అయితే వివిధ కారణాల వల్ల పూర్తిగా చెల్లించకుండానే 2018లో భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. రాష్ట్ర వ్యాపితంగా రూ. 2500 కోట్ల మేర ఈ బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. ఒక్క కృష్ణా జిల్లాలో 3107 పారిశ్రామిక యూనిట్లకు సంబంధించి రాయితీ బకాయిల మొత్తం 161.79 కోట్ల రూపాయల మేర
పేరుకుపోయాయి. దాదాపు రెండేళ్లుగా ఆయా యూనిట్ల యజమానులు రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. రాయితీలు, ప్రోత్సాహకాల బకాయిలు పేరుకుపోగా, మరోవైపు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బకాయిల చెల్లింపుపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ సందర్భాల్లో పారిశ్రామికవేత్తల సంఘాల ప్రతినిధులు ఈ అంశాన్ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రాయితీలు, ప్రోత్సాహకాల బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నా దానిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం పరిశ్రమల యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. బకాయిలపై ప్రభుత్వం దృష్టి సారించి చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు.