బిజినెస్

రెండో వారమూ అదే జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 10: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటుగా దేశీయంగా కూడా సర్వీసు రంగం మూడున్నరేళ్లలో ఎన్నడూ లేనంతగా వృద్ధి చెందడం లాంటి పరిణామాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా రెండో వారం కూడా మంచి లాభాలతో ముగిశాయి. ఫలితంగా అంతకు ముందు వారం భారీ లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు సెనె్సక్స్, నిఫ్టీ రెండూ కూడా గడచిన వారంలో కూడా ఊపు మీద కొనసాగాయి. ఫలితంగా సెనె్సక్స్ మొత్తం వారంలో 265.14 పాయింట్లు వృద్ధి చెందగా, నిఫ్టీ 57.05 పాయింట్లు లాభపడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందేమోనన్న భయాలు తొలగిపోవడంతో పాటు దేశీయంగా సర్వీసు రంగం మూడున్నరేళ్ల గరిష్ఠ స్థాయిలో వృద్ధి చెందడం దీనికి ప్రధాన కారణం. దీంతోమదుపరులు పెద్ద ఎత్తున దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 17 నెలల తర్వాత తొలిసారిగా 29 వేల పాయింట్లను దాటగా, నిఫ్టీ సైతం 8,950 పాయింట్ల స్థాయిని దాటింది. అయితే ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్ష జరపడం, ఐరోపా సెంట్రల్ బ్యాంకు కొత్త ఉత్ప్రేరకాలను ప్రకటించకపోవడం లాంటి కారణాలతో వారం చివరికల్లా ఆ ఊపు చల్లారి పోయింది. ఫలితంగా వృద్ధి 265.14 పాయింట్లకే పరిమితమైంది. సెనె్సక్స్ గత రెండు వారాల్లో మొత్తం 1015 పాయింట్లు వృద్ధి చెందగా, నిఫ్టీ సైతం రెండు వారాల్లో 294.15 పాయింట్లు లాభపడింది. ప్రధానంగా రియల్టీ, ఆటో, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాకింగ్, వినియోగ వస్తువులు, చమురు, గ్యాస్, విద్యుత్, లోహాలు, పిఎస్‌యు, ఎఫ్‌ఎంసిజిలాంటి దాదాపు అన్ని ప్రధాన రంగాల్లోను కొనుగోళ్ల ఊపు కనిపించింది. అయితే ఐటి, టెక్నాలజీ రంగాలకు చెందిన షేర్లలో మాత్రం లాభాల స్వీకరణ కనిపించింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీల షేర్లు కూడా మంచి లాభాలనే ఆర్జించాయి. ఈ నెల 5వ తేదీన గణేశ్ చతుర్థి సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో గత వారం మార్కెట్లు ఆయిదు రోజులే పని చేశాయి. కాగా, ఈ అయిదు రోజుల్లో విదేశీ పోర్ట్ఫులియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పిఐలు), విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు(ఎఫ్‌ఐఐలు) కలిసి రూ. 2,975.88 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి.
పుంజుకున్న బంగారం
ఇంతకుముందు వరసగా రెండు వారాలు నష్టాలు చవి చూసిన బంగారం ధరలు గత వారం మళ్లీ పుంజుకున్నాయి. ఆభరణాల తయారీదారులు, స్టాకిస్టులనుంచి తిరిగి డిమాండ్ కారణంగా బంగారం ధర తిరిగి పుంజుకుని పది గ్రాములు రూ. 31,175కు చేరుకుంది. మరోవైపు వెండి వరసగా మూడో వారం కూడా లాభాల్లో సాగింది. ఫలితంగా కిలో 46 వేల రూపాయల స్థాయికి చేరుకుంది.