బిజినెస్

లాభపడిన వొడాఫోన్ ఐడియా.. ఎయిర్‌టెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వచ్చే డిసెంబర్ మాసం నుంచి కాల్, డేటా చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ వాటాలకు మంగళవారం స్టాక్‌మార్కెట్‌లో మంచి డిమాండ్ నెలకొంది. ఈ రెండు ప్రైవేటు టెలికాం సంస్ధల వాటాలు దాదాపు 35 శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈలో వొడాఫోన్ ఐడియా వాటా 34.68 శాతం లాభపడి రూ. 6.02 వంతున ధర పలికింది. ఇంట్రాడేలో ఈ వాటాల విలువ 42.95 శాతం పెరిగింది. ఇక భారతీ ఎయిర్‌టెల్ వాటాలు సైతం లాభాల ర్యాలీతీసి 7.36 శాతం ఎగబాకి వాణిజ్య సమయం ముగిసే సమయానికి ఒక్కోవాటా ధర రూ. 439.25కు చేరింది. ఇంట్రాడేలో ఈ వాటా ధర ఓ దశలో 52 వారాల గరిష్టం 8.87 శాతం పెరిగి రూ. 445.45ను తాకింది. మార్కెట్లో విపరీతమైన పోటీతోబాటు, ఇటీవల వచ్చి పడిన చట్టబద్ధమైన రుణ బకారుూలతో సతమతమవుతున్న ఈ రెండు కంపెనీలు నష్ట నివారణకు కాల్, డేటా చార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించడం జరిగింది.