బిజినెస్

ఓఎన్‌జీసీ ప్రతిపాదిత సీనియర్ అన్ సెక్యూర్డ్ నోట్‌లకు బా-1 రేటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: చమురు, సహజ వాయువుల కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) రెండు బిలియ న్ డాలర్ల ఖర్చుతో ‘మధ్య కాలిక నోట్’ కార్యక్రమం ద్వారా చేపట్టేందుకు ప్రతిపాదించిన ‘సీనియర్ అన్‌సెక్యూర్డ్ నోట్లు’ విడుదలకు బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్స్ (బీఏఏ)1గా రేటింగ్ ఇచ్చినట్టు మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ బుధవారం నాడిక్కడ వెల్లడించింది. ఈ రేటింగ్స్ ఔట్‌లుక్ వ్యతిరేకంగా ఉందని మూడీస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తు తం కంపెనీ తీసుకున్న రుణాల ప్రొఫైల్ ఆధారంగా ఈ రేటింగ్ ఇచ్చినట్టు మూడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ హలాన్ తెలిపారు. ఈ రేటింగ్ ఆధారంగా ఓఎన్‌జీసీ భారత దేశంలో అతిపెద్ద సమగ్ర చమురు, సహజ వాయువుల కంపెనీగా గుర్తింపు పొందిందన్నారు. ఆ కంపెనీ సహజవావు నిల్వలు, ఉత్పత్తి, ముడిచమురు డిస్టిలేషన్ సామర్థ్యం, నిర్వహణ నిమిత్తం చేస్తున్న ఖర్చులు, వస్తున్న ఆదాయాలను ఈ విషయంలో పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఆయిల్ ధరలు, అత్యధిక వాటాదారుల లా భాలను సైతం ఈ రేటింగ్స్ ప్రభావితం చేస్తాయన్నారు. బ్యారెల్ 70 డాలర్లకు లోపు చము రు ధర ఉన్నంత వరకు ఓఎన్‌జీసీ ఇంధన సబ్సిడీలను కోరకపోవచ్చని మూడీస్ నివేదిక అంచనా వే సింది. ఈ కంపెనీపై అధికంగా ఆధారపడిన కేం ద్రం మద్దతూ అదే స్థాయిలో ఉందని తెలిపింది. కంపెనీ రుణ మూలధన మార్కెట్లలోకి సులభంగా ప్రవేశించగలిగిందని, ఇండియన్ ఆయిల్ కార్పొరేష న్, గెయిల్ ఇండియాల్లో ఓఎన్‌జీసీకి ఉన్న వాటాల భాగస్వామ్య విలువ ఈ ఏడాది నవంబర్ 14 నాటి కి రూ. 21వేల కోట్లుగా ఉందని మూడీస్ తెలిపింది.