బిజినెస్

వచ్చే ఐదేళ్లలో రూ. 2,500 కోట్ల వార్షికాదాయ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 20: మహీంద్రా గ్రూప్‌లోని సరసమైన ధరలకు గృహ నిర్మాణాలు చేసే విభాగం ‘మహీంద్రా హేప్పినెస్ట్’ వచ్చే ఐదేళ్ల కాలంలో సుమారు 10వేల యూనిట్లు పూర్తి చేసి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఆదాయాన్ని రూ. 2,500 కోట్లకు చేర్చాలన్న నిర్ణయించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలోని నాలుగు ప్రాజెక్టుల ద్వారా ‘హేప్పినెస్ట్’ బ్రాండ్ ద్వారా 4000 యూనిట్ల నిర్మాణం సాగిస్తోంది. అలాగే ఇబ్బందుల్లో కూరుకున్న సుమారు ఏడు ఆస్తులను ముంబయి, పూనేల్లో పునరుద్ధరించే పనిలో ఉంది. మహీంద్రా లైఫ్‌స్పేసెస్, హెచ్‌డీఎఫ్‌సీ కేపిటల్ అఫోర్టబుల్ రియల్ ఎస్టేట్ ఫండ్-1 మధ్య సంయుక్త వేదికగా ఈ ‘మహీంద్రా హేప్పినెస్ట్’ పనిచేస్తోంది. ఇటీవల తమ కంపెనీ కళ్యాణ్‌లో 1,241 యూనిట్లతో కూడిన ఓ ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగిందని కంపెనీ సీఈవో అరవింద్ సుబ్రమణ్యం పీటీఐకి తెలిపారు. తదుపరి పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు సన్నద్ధ అవుతున్నామని వచ్చే ఐదేళ్ల కాలంలో వెయ్యి యూనిట్లు విడుదల చేయాలన్న లక్ష్యం ఏర్పాటుచేసుకున్నామని తెలిపారు. గత ఏడాది కంపెనీకి రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని, వచ్చే ఐదేళ్లలో ఈ ఆదాయన్ని రూ. 2,500 కోట్లకు చేర్చాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. కొన్ని వాణిజ్య, ఆర్థిక ఒత్తిళ్లకు గురైన ఆస్తులను ప్రస్తుత మార్కెట్ తీరుతెన్నులకు అనుగుణంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం చెన్నై ఆవడిలో ఓ ప్రాజెక్టు, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్‌లోని బోయిసార్, పాయిఘర్, కళ్యాణ్‌లలో ఒక్కో ప్రాజెక్టు వంతున నిర్వహిస్తున్నట్టు వివరించారు. కళ్యాణ్‌లో మొత్తం ఏడు టవర్లను మూడు విడతల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.