బిజినెస్

పప్పుల సాగుకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: పప్పు ధాన్యాలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించి దేశంలో ధరల పెరుగుదలను అదుపు చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం పప్పుదినుసుల మిగులు నిల్వ పరిమితిని ప్రస్తుతమున్న 8 లక్షల టన్నుల నుంచి 20 లక్షల టన్నులకు పెంచాలని సోమవారం నిర్ణయించింది. మార్కెట్లో జోక్యం చేసుకుని ప్రజలకు సరసమైన ధరలకు పప్పుదినుసులు సరఫరా అయ్యేలా చూసేందుకు ప్రభుత్వం వాటిని పెద్ద మొత్తంలో నిల్వ చేస్తున్న విషయం విదితమే. దీంతో గత కొన్ని వారాలుగా పప్పుల ధరలు స్వల్పంగా తగ్గి ప్రధాన నగరాల్లో ప్రస్తుతం కిలో 115 నుంచి 170 రూపాయలకు చేరుకున్నాయి. ఈ ధరలను మరింత తగ్గించేందుకు పప్పుదినుసుల మిగులు నిల్వ పరిమితిని 20 లక్షల టన్నులకు పెంచాలని వినియోగదారుల వ్యవహారాల విభాగం చేసిన ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. దేశీయంగా రైతుల నుంచి పప్పు ధాన్యాలను కొనుగోలు చేయడంతో పాటు మరో 10 లక్షల టన్నుల పప్పుదినుసులను దిగుమతి చేసుకోవడం ద్వారా ఈ నిల్వలను పెంచడం జరుగుతుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇందుకు అవసరమైన నిధులను ధరల స్థిరీకరణ నిధి నుంచి అందజేస్తారు. దేశంలో పప్పు ధాన్యాలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు ధరలను స్థిరంగా ఉంచేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. అదనపు నిల్వలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ), నాఫెడ్, ఎస్‌ఎఫ్‌ఎసి వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశీయంగా రైతుల నుంచి మార్కెట్ ధరలకు పప్పుదినుసులను కొనుగోలు చేస్తాయి. కనీస మద్దతు ధరలు మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు కనీస మద్దతు ధరకే వీటిని కొనుగోలు చేస్తాయి. దీనికితోడు ఆహార ధాన్యాల సేకరణను వికేంద్రీకరించినట్లుగానే సాధ్యమైనప్పుడు పప్పు ధాన్యాలను కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారాన్ని కల్పించనున్నారు.
ఇక అదనపు నిల్వల కోసం విదేశాల నుంచి పప్పుదినుసులను దిగుమతి చేసుకునే పనిని కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని అధీకృత ప్రభుత్వ సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించడం లేదా అంతర్జాతీయ మార్కెట్లలో అప్పటికప్పుడు కొనుగోళ్లు జరపడం ద్వారా చేపడతారు.
దేశ వ్యాప్తంగా గత పంట సీజన్ (2014 జులై-2015 జూన్)లో 17.17 మిలియన్ టన్నుల పప్పు్ధన్యాల ఉత్పత్తి జరగ్గా, ప్రస్తుత పంట సీజన్‌లో ఇవి 16.47 మిలియన్ టన్నులకు తగ్గిపోయాయి. వర్షాభావ పరిస్థితుల వలన గత రెండేళ్లు పప్పు్ధన్యాల దిగుబడి తగ్గడంతో రిటైల్ మార్కెట్‌లో వాటి ధరలు పెరిగాయి. అయితే ప్రస్తుతం రుతుపవనాలు కరుణించి రైతులు అధిక విస్తీర్ణంలో పప్పు్ధన్యాల సాగుకు ఉపక్రమించడంతో ఈ ఏడాది వీటి ఉత్పత్తి 20 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎపిటిఎ కింద టారిఫ్ రాయితీల
మార్పిడికి ప్రభుత్వ ఆమోదం
ఇదిలావుంటే, ఆసియా, పసిఫిక్ వాణిజ్య ఒప్పందం (ఎపిటిఎ) కింద సుకాలకు సంబంధించిన రాయితీల మార్పిడికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్, చైనా సహా ఎపిటిఎలో సభ్య దేశాలుగా ఉన్న బంగ్లాదేశ్, లావోస్, కొరియా, శ్రీలంక మధ్య వాణిజ్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ‘మార్జిన్ ఆఫ్ ప్రిఫరెన్స్’ ప్రాతిపదికన ఆమోదించింది. గతంలో బ్యాంకాక్ ఒప్పందంగా పిలిచిన ఎపిటిఎతో పాటు దానికి సంబంధించిన సవరణలపై నాలుగో దఫా చర్చల్లో భాగంగా దీనిని ఆమోదించారు.
ఐఎస్‌ఎతో ఒప్పందం పొడిగింపు
మాంగనీస్ గనుల అనే్వషణకు ఐఎస్‌ఎ (ఇంటర్నేషనల్ సీబెడ్ అధారిటీ)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నికెల్, కోబాల్ట్, కాపర్ వంటి ఖనిజాల వెలికితీతకు దోహదపడేలా భూ విజ్ఞాన శాఖకు, ఐఎస్‌ఎకి మధ్య కుదిరిన ఈ ఒప్పంద ప్రస్తుత కాల పరిమితి వచ్చే ఏడాది మార్చి 24వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ ఒప్పందాన్ని 2022 వరకు పొడిగించేందుకు ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.