బిజినెస్

జీవితకాల గరిష్టానికి చేరువలో సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 20: రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌పార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభాల పంట పండించడంతో బుథవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రత్యేకించి బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 182 పాయింట్లు ఎగబాకి జీవితకాల గరిష్టానికి చేరువైంది. ఆరంభం నుంచే జోరందుకున్న ఈ సూచీ ఓ దశలో ఇంట్రాడే రికార్డు స్థాయి 40,816.38ను తాకింది. చివరికి 181.94 పాయింట్లు (0.45 శాతం) లాభపడి 40,651.64 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. జీవిత కాల గరిష్టానికి ఇక కేవలం రెండు పాయింట్ల దూరమే మిగిలింది. ఈనెల 7నే ఈ సూచీ జీవితకాల గరిష్టాన్ని తాకడం జరిగింది. కాగా బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 12000 మార్కుకు కేవలం 0.90 పాయింట్ల దూరంలో నిలిచింది. ఈ సూచీ తాజాగా 59 పాయింట్లు (0.49 శాతం) లాభపడి 11,999.10 పాయింట్ల గరిష్టానికి చేరింది. విలువ ప్రాతిపదికన చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ సెనె్సక్స్ ప్యాక్‌లో అత్యధికంగా 2.47 శాతం లాభపడి ఆగ్ర భాగాన్ని ఆక్రమించింది. ఈ కంపెనీ వాటా విలువ ఇంట్రాడేలో జీవితకాల గరిష్టం రూ. 1,571.85కు చేరింది. ఈ కంపెనికి చెందిన టెలికాం విభాగం రిలయన్స్ జియో మొబైల్ ఫోన్‌కాల్స్, డేటా చార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో రెండోరోజు కూడా ఈ కంపెనీ వాటాలు బాగా లాభపడ్డాయని విశే్లషకులు భావిస్తున్నారు. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ ఇలా కాల్, డేటా చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 10లక్షల కోట్లకు మార్కుకు చేరువైంది. ఈ కంపెనీ విలువ బుధవారం రూ. 9,80,699.59 కోట్లకు చేరింది. ఇక సెనె్సక్స్ ప్యాక్‌లో సన్‌పార్మా 5.73 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 5.50 శాతం, యెస్ బ్యాంక్ 2.65 శాతం వంతున అత్యధికంగా లాభపడిన కంపెనీల జాబితాలో చేరాయి. అలాగే ఎల్ అండ్ టీ, మారుతి, టెక్ మహీంద్రా, ఐటీసీ, పవర్‌గ్రిడ్ సైతం లాభాలను సంతరించుకున్నాయి.
మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 1.49 శాతం క్షీణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ 0.87 శాతం, టాటాస్టీల్ 0.83 శాతం నష్టపోగా హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ సైతం నష్టాల్లో ముగిశాయి. కేవలం వృద్ధిరేటు పెరగనుందన్న అంచనాలతోనే మార్కెట్లకు ఊతం లభించిందని ప్రముఖ విశే్లషకుడు సంజీవ్ భాసిన్ అభిప్రాయపడ్డారు. వృద్ధిరేటు పెరిగేందుకు మూడు అంశాలు దోహదం చేస్తున్నాయని, అందులో కార్పొరేట్ పన్నుల తగ్గింపు ప్రధానమైందికాగా కొన్ని భారీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వహణ సౌలభ్యం నిమిత్తం విభజించాలన్న ప్రభుత్వ ఆలోచన, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతుండడం వంటి అంశాలు 2020 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుందని అంచనా వేసేందుకు వీలు కల్పిస్తున్నాయన్నారు. రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈలో ఇంధనం, హెల్త్‌కేర్, చమురు, సహజవాయువులు, పారిశ్రామిక, కేపిటల్ గూడ్స్ సూచీలు లాభపడ్డాయి. స్థిరాస్తి, వినిమయ వస్తువులు, విద్యుత్, టెలికాం, వినిమయాలు 1.36 శాతం నష్టపోయాయి. ఇక బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.25 శాతం లాభపడ్డాయి.
15 పైసలు క్షీణించిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం సైతం 15 పైసలు క్షీణించి ఇంట్రాడేలో 71.86గా ట్రేడైంది. ఇక ముడిచమురు ధరలు 0.11 శాతం నష్టపోయి బ్యారెల్ 60.84 డాలర్ల వంతున ట్రేడైంది.

ట్రంప్ తాజా వ్యాఖ్యలతో ఆసియా మార్కెట్లు డీలా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో ఆసి యా దేశాల స్టాక్ మార్కెట్లు బుధవారం డీలాపడ్డాయి. మధ్యంతర ఒప్పందం కూడా పొసగని రీతిలో సుదీర్ఘకాలంగా సాగుతున్న అమెరికా-చైనా వాణిజ్య చర్చలను ఉద్దేశించి మంగళవారం ట్రంప్ వ్యా ఖ్యానిస్తూ 3ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో విఫలమైతే ఆ పరిణామం తదుపరి ఇరు దేశాలు సుంకాలు భారీగా పెంచే పరిస్థితులకు దారితీయవచ్చన్నారు. ఈ వ్యాఖ్యలు ఆసియా మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించాయి. మదుపర్లు అప్రమత్తమై వేచిచూసే దోరణిని అవలంభించడంతో షాంఘై, హాంగ్‌కాం గ్, టోక్యో, సియోల్ స్టాక్ మార్కెట్లు నష్టాలను సంతరించుకున్నా యి. ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభంలో నష్టాలనే నమోదు చేశాయి.