బిజినెస్

తక్కువ వడ్డీకి ఫోరెక్స్ లోన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: తక్కువ వడ్డీకే ఫోరెక్స్ లోన్లు అందజేసే అంశా న్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ఎగుమతులు, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం ఓ ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం చెప్పారు. ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని, అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విదేశీ మారకద్రవ్యం రూపంలో ఫోరెక్స్ రుణాలను అందజేయాల్సి ఉంటుందని, ఇది ఎగుమతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. అందుకే దేశంలోని ఎగుమతిదారులు ఫోరెక్స్ రుణాలను కోరుతున్నారని ఆయన చెప్పారు. తక్కువ వడ్డీకి విదేశీ మారకంలో రుణాలను అందజేస్తే ఎగుమతులు పెరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా, చైనా దేశాల్లో వృద్ధి రేటు మందగిస్తోందని గోయల్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడకుండా ఉండాలంటే ఎగుమతులు పెరగాలని అన్నారు. ఎగుమతులు పెరగడం ద్వారా దేశంలో ఉత్పత్తి అధికం అవుతుందని ఆయన అన్నారు. స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల వృద్ధి రేటును నిర్ధారిస్తుందన్న విషయాన్ని గుర్తు చేశారు. అమెరికా, చైనా దేశాలకు మన దేశం నుంచి జరుగుతున్న ఎగుమతులు 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018-19లో పెరిగిందని చెప్పారు. ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో మరింతగా పెరగవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు.