బిజినెస్

స్వల్పంగా తగ్గిన వెండి, బంగారు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: బంగారు ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు (తులం) బంగారం ధర రూ. 53 తగ్గి మొత్తం ధర 39,007గా ట్రేడైంది. రూపాయి విలువ స్వల్పంగా వృద్ధిచెందిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుందని వాణిజ్య వర్గాలు తెలిపాయి. బుధవారం ఈ ధర రూ. 39,060గా ఉండేది. ఇక వెండి ధరలు స్వల్పంగా (రూ. 20) దిద్దుబాటుకు గురై కిలో రూ. 45,830 వంతున ట్రేడైంది. బుధవారం నాడు ఈ ధర రూ. 45,850గా ఉండేదని వ్యాపారులు తెలిపారు. ఇక 24 కేరట్ల స్పాట్ గోల్డ్ ధరలు సైతం తులంపై రూ. 53 తగ్గుముఖం పట్టాయి. దేశంలో ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ బంగారు ధరలకు మరింత ఊతమిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన సీనియర్ విశే్లషకుడు తపన్‌పటేల్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం గురువారం బంగారు ధరలు స్వల్పంగా రాణించాయి. ఔన్సు ధర 1,472.70 డాలర్ల వంతున పలికింది. ఐతే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. ఔన్సు 17.10 డాలర్ల వంతున ట్రేడైంది. అమెరికా-చైనా వాణిజ్య, రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య చర్చల ప్రతికూలతలు వెండి, బంగారు ధరలను ప్రభావితం చేశాయని విశే్లషకులు చెబుతున్నారు.