బిజినెస్

2021లో సైతం అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి నిరాశాజనకమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యారిస్, నవంబర్ 21: అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి రేటు 2021లో సైతం గాడిలో పడుతుందన్న ఆశలేవీ కనిపించడం లేదని అంతర్జాతీయ ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్ధ ‘ఓఈసీడీ’ గురువారం నాడిక్కడ ప్రకటించింది. ఈ మేరకు ప్యారిస్‌కు చెందిన ఈ సంస్థ సవరించిన 2020 అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి అంచనాల నివేదికను విడుదల చేసింది. వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు 2.9 శాతం విస్తరించవచ్చని ఆ సంస్ధ అంచనావేసింది. గత సెప్టెంబర్‌లో ఈ సంస్థ విడుదల చేసిన అంచనాలకంటే ఇది 0.1 పర్సంటేజీ పాయింట్లు తక్కువ. దాదాపు34 దేశాల సభ్యత్వం కలిగిన ఓఈసీడీ వివిధ దేశాల ఆర్థిక, సామాజిక అంశాలను ప్రతిబింబిస్తుంది. 2021 సంవత్సరానికి సంబంథించి ప్రపంచంలో అత్యంత ఐశ్వర్యవంతమైన దేశాలతో కూడిన సమూహాన్ని ప్రకటించిన ఓఈసీడీ ఈ విషయంలో సైతం 3.0 శాతం తగ్గుదలతో కూడిన అంచనాలను వెలువరించిందని ఆ సంస్థ చీఫ్ ఎకానమిస్ట్ లారెన్స్ బూన్ ఈ సందర్భంగా తెలిపారు. గడచిన రెండేళ్లుగా అంతర్జాతీయ అర్థికాభివృద్ధిలో స్థిరమైన తరుగుదల చోటుచేసుకుంటోందని, ఇందుకు కారణం నిర్థిష్ట విధాన లోపంతోబాటు వాణిజ్యంలో గణనీయంగా తగ్గుతున్న పెట్టుబడులేనని ఆమె విశే్లషించారు.
ఓవైపు సెంట్రల్ బ్యాంకులు తమవంతు నిర్ణయాత్మకంగా, కాలానుగుణ ద్రవ్య వినిమయ విధాన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ అవి వాణిజ్య రంగంలో మరింత నష్టాలు రాకుండా కొంతమేర మాత్రమే ప్రభావితం చేయగలిగాయని ఆమె తెలిపారు. ఐతే ఈ దిశగా అవసరమైన మేర అనేక దేశాల ప్రభుత్వాలు స్పందించలేకపోయాయన్నారు. దీర్ఘకాలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు మదుపు చేయడం ద్వారా వౌలిక వసతులను పెంపొందించుకోవడం, ఆర్థికాంశాలను ఆధునిక సాంకేతికతతో కూడిన డిజిటలైజేషన్ చేయడం, వాతావరణ అసమల్యాన్ని అరికట్టడం వంటి చర్యలు తీసుకోవడంలో అనేక దేశాలు విఫలమయ్యాయని తమ అధ్యయనంలో తేలిందన్నారు. ప్రస్తుతానికి అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి గణాంకాలు బలహీనంగా ఉన్నట్టు గుర్తించామని, 2021లో ఇందులో 2.0 శాతం మాంద్యం చోటుచేసుకునే అవకాశాలున్నాయని ఆమె వెల్లడించారు. జపాన్, ఐరోపా దేశాల్లో 0.7 నుంచి 1.2 శాతం వృద్ధి చోటుచేసుకుంటుందని అంచనా వేసినట్టు బూన్ తెలిపారు. అలాగే చైనాలో వృద్ధిరేటు తరుగుదల కొనసాగి 2021లో 5.5 శాతానికి తగ్గుతుందన్నారు.