బిజినెస్

12 శాతం వృద్ధిని నమోదు చేసిన ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్’ వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: జీ ఎంటర్‌టైనె్మంట్ ఎంటర్‌ప్రైజెస్ వాటాలు గురువారం 12 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రుణా లు చెల్లించేందుకు వీలుగా ఈ సంస్థలోని 16.5 శాతం వాటాల ను విక్రయించనున్నట్టు సుభాష్ చంద్ర నేతృత్వంలోని ప్రమోటర్ ఎస్సెల్ గ్రూప్ ప్రకటించిన క్రమంలో స్టాక్ మార్కెట్లో ఈ వాటాలు రాణించాయి. బీఎస్‌ఈలో 12.40 శాతం వృద్ధితో ఒ క్కోవాటా రూ. 345.25 వంతున ట్రేడైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 11.72 శాతం వృద్థితో ఒక్కోవాటా రూ. 343 వంతున ట్రేడైం ది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ వాటాలు 18.56 శాతం వృద్ధితో రూ.364 వంతున ధర పలికాయి. ఇక వాణిజ్య విలువననుసరించి 70.32 లక్షల వాటాలు బీఎస్‌ఈలో, 10 కోట్ల యూనిట్లు జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ట్రేడయ్యాయి. కాగా గత సెప్టెంబర్‌లో ఎస్సెల్ గ్రూప్ తన అనుబంధ సంస్థ ‘జీల్’ నుంచి 11 శాతం వాటాలను ‘ఇనె్వస్కో ఓప్పెన్ హెయిమర్ ఫండ్’కు రూ. 4,224 కోట్లకు విక్రయించింది. తద్వారా సుమా రు రూ. 4000 కోట్ల రుణాల నుంచి విముక్తి పొందింది.