బిజినెస్

అంతర్జాతీయ ప్రతికూలతలతో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లోకి జారాయి. ప్రభుత్వం తాజాగా చేపట్టిన ఆర్థికాభివృద్థి సంస్కరణలు సైతం మదుపర్ల లాభాల స్వీకరణకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఓవైపు అమెరికా-చైనా వాణిజ్య చర్చల తాలూకు అయోమయం సైతం స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా మారిందని విశే్లషకులు చెబుతున్నారు. ఆరంభం నుంచీ సూచీలు ఒడిదుడుకులకు గురైన క్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ చివరిగా 76.47 (0.19 శాతం) పాయింట్లు కోల్పోయి 40,576.17 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిప్టీ సైతం 30.70 (0.26 శాతం) పాయింట్లు నష్టపోయి 11,968.40 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. దేశంలో అతిపెద్ద ప్రైవేటైజేషన్ ప్రక్రియకు తెరలేపిన కేంద్ర ప్రభుత్వం మొత్తం ఐదు ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాలకు నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం బుధవారం ఆమోదించడం జరిగింది. అలాగే భారీగా అప్పుల్లో కూరుకున్న టెలికాం కంపెనీల నుంచి వచ్చే రెండేళ్ల వరకు స్పెక్ట్రంకు సంబందించిన ఎలాంటి వసూళ్లు చేయకూడదని నిర్ణయించడం ద్వారా ఆ కంపెనీలకు సుమారు రూ. 42వేల కోట్ల వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఐతే ఇవేవీ మార్కెట్ నష్టాలకు తక్షణం అడ్డుకట్ట వేయలేకపోయాయి. అలాగే అమెరికా చట్టసభలు హాంగ్‌కాంగ్‌లో జరుగుతున్న నిరసనలకు మద్దతునివ్వడం ద్వారా అమెరికా-చైనా వాణిజ్య బంధాలను మరింత క్లిష్టతరం చేయడం స్టాక్ మార్కెట్లలో వాణిజ్య సెంటిమెంట్‌ను దెబ్బతీశాయంటున్నారు.ప్రస్తుతం మధ్యంతర ఒప్పందం సైతం ఆలస్యం అవుతూ దీర్ఘకాలంగా సాగుతున్న అమెరికా-చైనా చర్చల తీరు సైతం మదుపర్లు ఆచితూచి అడుగేసేలా చేశాయి. అలాగే అమెరికన్ ఫెడ్ తదుపరి సమావేశ అజెండా సైతం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ల ప్రతికూలతకు ఆజ్యం పోసిందని విశే్లషకులు చెబుతున్నారు.
రంగాల సూచీల్లో అమ్మకాల వత్తిడి
దేశీయంగా మెజారిటీ శాతం రంగాలకు చెందిన సూచీలు గురువారం విక్రయాల వత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రధానంగా మార్కెట్ విలువ పెరిగినప్పటికీ మదుపర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. బీఎస్‌ఈలో లోహ, చమురు సహజవాయువులు, టెలికాం, ఇంధనం, వౌలిక పరికరాలు, వినిమయ వస్తువులు, వాహన సూచీలు 2.23 శాతం క్షీణించాయి. స్థిరాస్తి, కేపిటల్ గూడ్స్, ఫైనాన్స్, ఐటీ, టెక్ సూచీలు 0.45 శాతం రాణించాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు .73 శాతం క్షీణించాయి. ఇక సెనె్సక్స్ ప్యాక్‌లో టాటాస్టీల్ అత్యధికంగా 3.35 శాతం నష్టపోయింది. అలాగే భారతీ ఎయిర్‌టెల్ 2.52 శాతం, యెస్ బ్యాంక్ 2.43 శాతం, ఓఎన్‌జీసీ 1.98 శాతం, ఐటీసీ 1.96 శాతం నష్టపోయాయి. మరోవైపు హెచ్‌యూఎల్ 1.15 శాతం లాభపడగా, ఎల్ అండ్ టీ 0.89 శాతం, బజాజ్ ఆటో 0.82 శాతం, ఎస్‌బీఐ 0.81 శాతం లాభపడ్డాయి. కాగా వచ్చే వారం వెలువడనున్న రెండో త్రైమాసిక జీడీపీ వృద్ధిరేటు అంచనాలపై ప్రస్తుతం మదుపర్లు దృష్టి నిలిపారు. ఈ అంచనాలు తొలి త్రైమాసిక అంచనాలు 5 శాతానికన్నా తక్కువగా ఉంటాయన్న కథనాలు వెలువడుతున్నాయి.
నష్టపోయిన ఆసియా మార్కెట్లు
ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సాగుతున్న వాణిజ్య యుద్థ పరిష్కార ఒప్పంద చర్చలు ఈ ఏడాది పరిష్కారమయ్యే అవకాశాలు లేవన్న వార్తల నేపథ్యంలో గురువారం ఆసియా మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ మార్కెట్లు నష్టాలపాలుకాగా, ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలను సంతరించుకున్నాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా రాణించి ఇంట్రాడేలో 71.78గా ట్రేడైంది. ముడిచమురు ధరలు 0.51 శాతం క్షీణించి బ్యారెల్ 62.08 డాలర్లు వంతున ట్రేడైంది.