బిజినెస్

సత్వర రుణ పథకాన్ని ఆరంభించిన ‘టొయోటో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వాహన రంగ దిగ్గజం టొయోటాకు చెందిన అనుబంధ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌బీసీ) విభాగం ‘టొయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్’ గురువారం ‘సత్వర ఆర్థిక చేయూత పథకం’ (ఇన్‌స్టెంట్ ఫైనాన్సింగ్ స్కీం)ను ఆరంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు కారు రుణాన్ని కేవలం 30 నిమిషాల్లో పొందవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ రుణాన్ని పొందగోరే దరఖాస్తుదారుడు సొంత ఇల్లు కలిగి సొంత అవసరాలకు వాహనం వినియోగించుకునే వారై ఉండాలన్నారు. కారు కొనుగోలు ప్రక్రియను మరింత సరళతరం, సౌలభ్యంగా మార్చాలన్నదే ఈ పథకం లక్ష్యమని టోయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ తొమోహెయ్ మట్సుస్థిత ఈ సందర్భంగా విలేఖరులకు తెలిపారు. ఈక్రమంలో మొత్తం వాహన కొనుగోలు ప్రక్రియను తత్కాల్ సేవల పరిధిలో ఆటోమేషన్ చేశామన్నారు. అతితక్కువ జోక్యంతో సులభ డాక్యుమెంటేషన్ సదుపాయాన్ని వినియోగదారులకు అందజేయడం జరుగుతుందన్నారు.